Allu Arjun: పీరియాడిక్ డ్రామాలో ఐకాన్ స్టార్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శుక్రవారం నాడు విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. బన్నీ అభిమానులకు ఈ సినిమా విపరీతంగా నచ్చేసింది. ఓ వర్గం ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా మెప్పించలేకపోతుంది. టాక్ ఎలా ఉన్నా.. సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం దూసుకుపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. ఈ సినిమాకి కొనసాగింపుగా రెండో భాగాన్ని చిత్రీకరించనున్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి పార్ట్ 2 రెగ్యులర్ షూటింగ్ ను నిర్వహించనున్నారు. దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టనున్నారు బన్నీ. వచ్చే ఏడాదిలోనే బోయపాటి సినిమాను మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. బన్నీ కోసం ఇంట్రెస్టింగ్ స్టోరీ రాసుకున్నాడట బోయపాటి శ్రీను. అది 1940ల కాలానికి చెందిన కథ అని తెలుస్తోంది. పీరియాడిక్ నేపథ్యంలో సాగే స్టోరీ. కాన్సెప్ట్ నచ్చడంతో బన్నీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ముందుగా పుష్ప పార్ట్ 2ని పూర్తి చేసి బోయపాటి సినిమాను పట్టాలెక్కించనున్నారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమా అని సమాచారం. గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. గతంలో బన్నీ-బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘సరైనోడు’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కానుంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus