Allu Arjun: బన్నీ సంకేతాలు వాళ్లకు నచ్చడం లేదా?

అల వైకుంఠపురములో, పుష్ప సినిమాలతో బన్నీ ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ భారీ బ్లాక్ బస్టర్ హిట్లు చేరాయి. పుష్ప ది రైజ్ బాలీవుడ్ లో బన్నీకి ఊహించని స్థాయిలో మార్కెట్ ను పెంచింది. బాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలకు సమానంగా ఈ సినిమా కలెక్షన్లను సాధించడం గమనార్హం. పుష్ప సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని బన్నీ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలను పెంచగా ఈ సినిమాతో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది.ఈ ట్రైలర్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :

బన్నీ తనకు స్టైలిష్ స్టార్ అని ఉన్న బిరుదును సైతం ఐకాన్ స్టార్ గా మార్చుకున్న సంగతి తెలిసిందే. బన్నీ పీఆర్ టీం సైతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగే విధంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటూ సొంత బ్రాండ్ ను పెంచుకోవడానికి బన్నీ చాలా కష్టపడుతున్నారు. తాజాగా బన్నీ రౌడీ బాయ్స్ మూవీ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యారు.

ఈ ఈవెంట్ లో బన్నీ ధరించిన టీ షర్ట్ గురించి చర్చ జరుగుతోంది. పుష్ప మూవీ క్లైమాక్స్ సీన్ లో ఇది సార్ నా బ్రాండ్ అనే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఆ డైలాగ్ తో పాటు చేతి ముద్ర ఉన్న టీ షర్ట్ తో రౌడీ బాయ్స్ ఈవెంట్ లో బన్నీ సందడి చేశారు. బన్నీ ప్రసంగించే సమయంలో వెనక్కు తిరిగి టీషర్ట్ పై ఉండే ట్యాగ్ ను చూపించారు. అయితే బన్నీ ఇలా చేయడంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బన్నీ మెగా బ్రాండ్ కు దూరంగా సొంత బ్రాండ్ కు దగ్గరగా ఉండే ప్రయత్నాలు చేస్తున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అల్లు బ్రాండ్ ను ప్రమోట్ చేసుకోవడానికి బన్నీ ఇష్టపడుతున్నారు. బన్నీ తనను తాను ప్రమోట్ చేసుకుంటూ ఇస్తున్న సంకేతాలు కొంతమంది మెగా ఫ్యాన్స్ కు నచ్చడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus