Allu Arjun: పుష్ప2 విషయంలో అల్లు అర్జున్ కోరిక నెరవేరుతుందా?

2021 సంవత్సరం డిసెంబర్ నెలలో యావరేజ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద పుష్ప ది రైజ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు దేశమంతటా బన్నీ, సుకుమార్ పేరు మారుమ్రోగింది. పుష్ప ది రైజ్ కథ, కథనం కొత్తగా ఉండటంతో పాటు అల్లు అర్జున్ గెటప్ కు మంచి మార్కులు పడ్డాయి. మైత్రీ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా నిర్మించడం ఈ సినిమాకు ప్లస్ అయింది.

ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ జరుగుతుండగా ఏప్రిల్ నెల 8వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయి. పుష్ప2 సినిమాకు రికార్డ్ స్థాయిలో ఆఫర్లు వస్తున్నా బన్నీ, నిర్మాతలు మాత్రం రిలీజ్ సమయం వరకు వేచి చూడాలని భావిస్తున్నారని తెలుస్తోంది. పుష్ప2 సినిమా ఆస్కార్ నామినేషన్స్ కు వెళ్లాలని బన్నీ, సుకుమార్ భావిస్తున్నారని తెలుస్తోంది. పుష్ప2 సినిమా 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీని మించి పుష్ప2 హక్కులు అమ్మే దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.

1000 కోట్ల రూపాయలకు ఈ సినిమా హక్కులు అమ్ముడయ్యేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. సుకుమార్ ఈ సినిమా విషయంలో ఒకింత ఒత్తిడి ఫీలవుతున్నారని తెలుస్తోంది. పుష్ప2 బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. పుష్ప2 సినిమా మరి ఆ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వస్తే పుష్ప2 కు కూడా ఆస్కార్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేయనున్నారని సమాచారం అందుతోంది.

పుష్ప2 సినిమాలో కంటెంట్ మరీ అద్భుతంగా ఉంటే మాత్రమే ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయి. సినిమాల ఎంపికలో బన్నీ ఆచితూచి వ్యవహరిస్తుండగా చాలామంది డైరెక్టర్లకు బన్నీ హ్యాండ్ ఇచ్చారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప2 సినిమా కోసం బన్నీ 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus