అల్లు అరవింద్ గారు ఓటిటి ప్లాట్-ఫామ్లోకి ఎంట్రీ ఇస్తూ ‘ఆహా’ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పూర్తిస్థాయి తెలుగు కంటెంట్ ను అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. మొదట్లో తక్కువ కంటెంట్ తో ‘ఆహా’ ను మొదలుపెట్టినప్పటికీ.. లాక్ డౌన్ రావడం వలన ‘ఆహా’ కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ప్రారంభించిన 9 నెలల్లోనే ‘ఆహా’ కు మంచి ఆదరణ దక్కింది. గత రెండు నెలల నుండీ కొత్త కొత్త కంటెంట్ ను అందిస్తూ.. మరింత స్థాయిలో దూసుకుపోతుంది ‘ఆహా’.
మొదట దీనికి విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేవాడు. అయితే ఇప్పుడు అతని స్థానంలోకి అల్లు అర్జున్ వచ్చాడు. స్టయిలిష్ స్టార్ రాకతో మరింత మంది సబ్స్క్రైబర్లు పెరుగుతారని ‘ఆహా’ టీం ముఖ్య ఉద్దేశం కావచ్చు. సరే ఇంతకీ ‘ఆహా’ కోసం అల్లు అర్జున్ ఎంత పారితోషికం అందుకుంటున్నాడు? అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఉంది. ‘ఆహా’ తన తండ్రిదే అయినప్పటికీ.. దిల్ రాజు కూతురు అలాగే మై హోమ్స్ వారు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టారట.
కాబట్టి అల్లు అర్జున్ కూడా ఓ బ్రాండ్ అంబాసిడర్ గానే వ్యవహరించాల్సి ఉంటుంది. అల్లు అర్జున్ ను ‘ఆహా’ కు బ్రాండ్ అంబాసిడర్ ను చెయ్యమని దిల్ రాజే.. అరవింద్ గారికి చెప్పారట. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్.. ‘ఆహా’ ను ప్రమోట్ చెయ్యడం కోసం రూ.5 కోట్లు పారితోషికం అందుకోబోతున్నాడని సమాచారం. అల్లు అర్జున్ ప్రమోట్ చేసే ఏ బ్రాండ్ కు అయిన ఇంతే తీసుకుంటాడట.
Most Recommended Video
‘కమిట్ మెంటల్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?