అల్లు అర్జున్ ఆలోచన అదిరిపోయింది!

“మై డియర్ ఫ్యాన్స్… నా తదుపరి సినిమా ప్రకటన గురించి ఓపికగా ఉండండి. ఎందుకంటే అది ఇంకాస్త సమయాన్ని తీసుకోవచ్చు. ఓ మంచి చిత్రాన్ని మీకందించాలని చూస్తున్నాను. కొంత సమయం పడుతుంది.  “అని గతంలో అల్లు అర్జున్ అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. ఈ ట్వీట్ తో నా పేరు సూర్య తర్వాత బన్నీ ఎవరితో మూవీ చేస్తారనే ఫాల్స్ వార్తలకు కళ్లెం వేశారు. అలాగే ఓపిగ్గా మంచి కథకే బన్నీ ఒకే చెప్పినట్టు తెలిసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలోనే సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు టాక్. గతంలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. విజయాన్ని సాధించాయి. హ్యాట్రిక్ అందుకోవాలని కొంతకాలంగా ట్రై చేశారు.

ఇప్పుడు సెట్ అయింది. ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమా చేస్తున్నారు. ఇది ఈనెల 11 న రిలీజ్ కానుంది. దీని తర్వాత బన్నీ కథపైన దృష్టిపెట్టనున్నారు. అయితే ఈ సినిమా విషయంలో మరో న్యూస్ బయటికి వచ్చింది. ఇందులో తమిళ హీరో విక్రమ్ కీలకరోల్ పోషించనున్నట్టు తెలిసింది. అదే విధంగా ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్నట్టు సమాచారం. ఎప్పటి నుంచో బన్నీ కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. అలాగే విక్రమ్ తో కలిసి నటించాలని ఆశపడుతున్నారు. ఈ సినిమాతో బన్నీ రెండు కలలు నెరవేరనున్నాయి. రీసెంట్ గా అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్‌లో కొత్త ఆఫీస్‌ను ప్రారంభించారు. ఆ ఆఫీస్ బన్నీకి కలిసివచ్చేలా కనిపిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus