టాలీవుడ్ లో మెగా హీరోగా మొదలయ్యి తనకంటూ మంచి ఫాలోయింగ్ ను సృష్టించుకున్నాడు మన బన్నీ. అయితే వరుస హిట్స్ తో దూసుకుపోతున్న బన్నీ తన స్టైల్ మార్చి ఇప్పుడు కామెడీ టచ్ అప్ తో బ్రాహ్మణుడి పాత్ర చేస్తున్నాడు. ఇదిలా ఉంటే సినిమా తెరకెక్కించే పద్దతి కన్నా, దాన్ని ప్రమోట్ చేసుకునే పద్దతిలోనే సినిమా సగం హిట్ అని ఇట్టే చెప్పేయ్యవచ్చు. విషయం ఏమిటి అంటే టాలీవుడ్ లో ఆడియో వేడుకలకు చెక్ పెడుతూ ప్రీ-రిలీజ్ ఫంక్షన్స్ ను స్టార్ట్ చేసిందే బన్నీ. తన గత సినిమా సరైనోడుతో ఈ కొత్త ప్రయత్నానికి నాంది పలికాడు. అయితే ఈ సాంప్రదాయం ఇప్పుడు ఎలా మారిపోయింది అంటే…ఇప్పుడు చాలమంది హీరోలు తమ సినిమాలకు సంబంధించి ఈకల్చర్ నే ఫాలో అవుతున్నారు. ఆఖరుకి పవన్ కళ్యాణ్ లాంటి టాలీవుడ్ టాప్ హీరోలు కూడ బన్నీ ఫార్ములాను అనుసరించారు అంటే అల్లు అర్జున్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏ విదంగా అందరినీ ప్రభావితం చేసిందో అర్ధం అవుతుంది.
అయితే ఇప్పుడు దువ్వాడ జగన్నాధం సినిమాతో మన ముందుకు వస్తున్న బన్నీ ఈ సినిమా కోసం రెండు మార్కెటింగ్ స్ట్రాటజీలు అనుసరిస్తూ తన అభిమానులకు డబల్ ధమాకా ఇవ్వడానికి వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నాడు అని టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వార్త. వినిపిస్తున్న విషయం మేరకు దువ్వాడ జగన్నాథమ్ సినిమాకు సంబంధించి పాటల విడుదల వేడుకతో పాటు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడ పెట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 11వ తేదీ ఆదివారం రోజున ‘డీజే’ ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఇక ఈ ఆదివారం ఆడియో ఫంక్షన్ అయిన తర్వాత వచ్చే ఆ ఆదివారం జూన్ 18న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడ చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా ఈ రెండు ప్రోగ్ర్యామ్స్ తో ఈ సినిమాకి మంచి హైప్ ని తీసుకు వచ్చి ఎలా అయినా 100కోట్ల మూవీ క్లబ్ లో ఈ సినిమాను చేర్చాలి అని పక్కా ప్లాన్ తో బన్నీ ఆలోచన చేస్తున్నాడు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.