Allu Arjun statue: వామ్మో.. నార్త్ ఇండియాలో బన్నీకి ఇంత క్రేజా?

బాహుబలి సిరీస్ సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఏర్పడగా పుష్ప ది రైజ్ తో అల్లు అర్జున్ బాలీవుడ్ హీరోల స్థాయిలో బాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులారిటీని సంపాదించుకున్నారు. పెద్దగా అంచనాలు లేకుండా హిందీలో విడుదలైన పుష్ప ఇప్పటికీ హిందీలో కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. అమెజాన్ ప్రైమ్ లో హిందీలో ఈ సినిమా అందుబాటులో ఉన్నా చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది.

Click Here To Watch

పుష్ప ది రైజ్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నీకి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఔరంగాబాద్ ప్రాంతానికి చెందిన బన్నీ ఫ్యాన్ ఒకరు బన్నీపై అభిమానంతో విగ్రహంను తయారు చేస్తున్నారని తెలుస్తోంది. సోహన్ కుమార్ అనే బన్నీ ఫ్యాన్ పుష్పరాజ్ పాత్రనుంచి ప్రేరణ పొంది విగ్రహాన్ని తయారు చేయించారని సమాచారం. బన్నీ తుపాకి పట్టుకుని ఉండేలా ఈ విగ్రహం తయారు చేశారని బోగట్టా. బన్నీ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సోహన్ కుమార్ బన్నీ బర్త్ డే రోజున ఈ విగ్రహాన్ని బన్నీకి ఇవ్వనున్నారని తెలుస్తోంది. బన్నీ నటించిన డబ్బింగ్ సినిమాలను చూసి సోహన్ కుమార్ బన్నీకి ఫ్యాన్ అయ్యారు. బన్నీ నటించిన పలు సినిమాలు హిందీలో యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు పుష్ప ది రూల్ షూటింగ్ అతి త్వరలో మొదలుకానుంది. భారీ బడ్జెట్ తో పుష్ప ది రూల్ తెరకెక్కుతుండగా త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

బడ్జెట్ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా పుష్ప ది రూల్ ను తెరకెక్కించనున్నారని బోగట్టా. పుష్ప ది రైజ్ మ్యాజిక్ ను బన్నీ పుష్ప ది రూల్ తో రిపీట్ చేస్తారేమో చూడాలి. సుకుమార్ స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కిస్తూ వరుసగా విజయాలను అందుకుంటున్నారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus