‘అల్లు అర్జున్ 20’ ఫస్ట్ లుక్ ఆ రోజు వచ్చేనా?

సాధారణంగా దర్శకుడు సుకుమార్ సినిమా అంటే.. చాలా టైం పడుతుంది అన్న టాక్ ఇండస్ట్రీలో ఎప్పటినుండో ఉంది. ‘రంగస్థలం’ సినిమా 2018 లో మార్చి 30న విడుదల అయ్యింది. అంటే రెండేళ్లు పూర్తయ్యింది. ఇక సుకుమార్ తరువాతి సినిమా అల్లు అర్జున్ తో అని ఆనౌన్స్ చేసి కూడా చాలా రోజులయ్యింది. కానీ ఇంకా సినిమా మొదలుకాలేదు. ఇప్పుడున్న పరిస్ధితిని బట్టి సినిమా మొదలయ్యే అవకాశాలు లేవు.

అయితే ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ అని ఆనౌన్స్ చేసారు… ఆ విషయం ఆమె కూడా కన్ఫార్మ్ చేసింది. ఈ చిత్రానికి ‘శేషాచలం’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దాని పై మాత్రం ఎవ్వరూ క్లారిటీ రాలేదు. ఎర్ర చందనం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని టాక్. అయితే అధికారికంగా ఏదీ కన్ఫార్మ్ చెయ్యలేదు చిత్ర యూనిట్ సభ్యులు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

అయితే సుకుమార్ ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను ఆనౌన్స్ చేసే పనిలో బిజీగా ఉన్నాడట. ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ పుట్టిన రోజు కాబట్టి.. అదే రోజున టైటిల్ అనౌన్స్మెంట్ మరియు ఫస్ట్ లుక్ విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. దీని పై నిర్మాతలు అయిన ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ట్విట్టర్ లో ఈరోజు లేదా రేపు అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందని కూడా సమాచారం. ఇక ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus