బన్నీ-సుకుమార్ సినిమా అలా సాగుతుందట

దర్శకుడు సుకుమార్ సినిమాలన్నీ కథా ప్రధానంగా సాగుతాయి. అలాగే కథతో హీరో పాత్ర గట్టిగా ముడిపడి ఉంటుంది. హీరోకి ఓ కొత్త లుక్ మరియు మేనరిజం రూపొందించించడం ఆయన ప్రత్యేకత. నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్, 100% లవ్ సినిమాలో చైతన్య, నేనొక్కడినే లో మహేష్, రంగస్థలంలో చరణ్ ఇక ఆర్య సినిమాలో బన్నీ పాత్ర కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కాగా బన్నీ-సుకుమార్ చిత్ర నేపథ్యం ఇప్పటికే తెలిసిపోయింది.

బన్నీ మాస్ లారీ డ్రైవర్ రోల్ చేస్తుండగా, ఎర్ర చందనపు స్మగ్లింగ్ ప్రధానంగా సాగుతుందట. కాగా సుకుమార్ గత చిత్రాలైన నాన్నకు ప్రేమతో, రంగస్థలం వలే ఈ మూవీ కూడా రివేంజ్ డ్రామాగా వస్తుందని ప్రచారం జరుగుతుంది. ఐతే ఈ చిత్రంలో సుకుమార్ రివేంజ్ కి మించి ఎమోషన్స్ పై ద్రుష్టి పెట్టారట. సినిమాలో రివేంజ్ యాంగిల్ ఉన్నప్పటికీ ఎమోషన్స్ కి సుకుమార్ పెద్దపీట వేయనున్నారని తెలుస్తున్న తాజా సమాచారం.

దీనితో పాటు యాక్షన్ సన్నివేశాలు, ఛేజింగ్ సీన్స్ హైలెట్ గా సాగుతుందట ఈ చిత్రం. రివేంజ్, యాక్షన్ మరియు ఎమోషన్స్ కలగలిపి ఫుల్ ప్యాకెడ్ ఎంటర్టైనర్ గా సుకుమార్ సిద్ధం చేస్తున్నారట. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. కేరళలో ఫస్ట్ షెడ్యూల్ ముగించగా సెకండ్ షెడ్యూల్ త్వరలో మొదలుకానుంది. ఈ సినిమా కోసం బన్నీ గడ్డం, జుట్టు పెంచడంతో పాటు ఫుల్ మేకోవర్ అవుతున్నారు.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus