సిల్వర్ స్క్రీను కాస్త పక్కన పెట్టి, యూట్యూబ్ లో కి కాస్త మనం తొంగి చూస్తే, మన తెలుగు సినిమాలు అదీ హిందీ డబ్బింగ్ అయ్యీ ఎలా చెలరేగిపోతున్నాయి అని ఇట్టే అర్ధం అయిపోతుంది. అంతెందుకు గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన పెద్ద హీరోల సినిమాల హిందీ వెర్షన్లకు వచ్చిన హిట్స్ చూస్తే దిమ్మదిరిగిపోవాల్సిందే. హిట్టా ఫ్లాపా అన్నది సంబంధం లేకుండా తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లకు కోట్లల్లో వ్యూస్ ఉంటాయి. ముఖ్యంగా మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోల సినిమాల్ని హిందీ ప్రేక్షకులు విరగబడి చూసేస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. అదే విషయాన్ని ఇప్పుడు క్యాష్ చేసుకోవాలి అనుకుంటున్నాడు మన స్టైలిష్ స్టార్. ఇప్పటికే మన స్టైలిష్ స్టార్ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లాంటి యావరేజ్ మూవీకి యూట్యూబ్ లో దగ్గర దగ్గర మూడు కోట్ల వ్యూస్ ఉండడం చూస్తుంటే మన డీజె కి అక్కడ ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవాల్సిందే.
ఇక ఈ క్రేజ్ చూసుకునే బన్నీ కొత్త సినిమా ‘దువ్వాడ జగన్నాథం’ హిందీ శాటిలైట్, డిజిటల్ హక్కుల కోసం ఓ సంస్థ ఏకంగా రూ.7 కోట్లు చెల్లించినట్లు సమాచారం, అంటే బాహుబలిని మినహాయిస్తే శాటిలైట్, డిజిటల్ హక్కులకు తెలుగులో అత్యధికంగా పలికిన ధర ఇదే కావడం విశేషం. అసలే మన అల్లు వారి వారసున్ని, మలయాళంలో మల్లు అంటారు, తమిళంలో కూడా బన్నీకి పిచ్చ క్రేజ్ ఉంది. ఇక తెలుగు కనడంలో బన్నీ ఇమేజ్ కి డోకానే లేదు, ఇలాంటి సమయంలో ఇటు సౌత్ ను ఒక ఊపు ఊపుతూనే, అటు నార్త్ పై కూడా ఫోకస్ పెట్టాడు బన్నీ, మరి ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయితే బాలీవుడ్ కి బ్యాండ్ తప్పదు అనే చెప్పాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.