‘పుష్ప2’ తరువాత త్రివిక్రమ్ తోనే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఇతర భాషల్లో కూడా భారీ విజయాన్ని అందుకుంది. నార్త్ లో అయితే ఈ సినిమా రికార్డులు సృష్టించింది. దీంతో ఇప్పుడు తెరకెక్కుతోన్న ‘పుష్ప2’పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. పార్ట్ 1 కంటే పార్ట్ 2లో ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్.

ఈ సినిమా తరువాత బన్నీ ఎవరితో సినిమా చేయబోతున్నారనే విషయంలో క్లారిటీ లేదు. లైనప్ పెద్దగానే ఉంది కానీ వెంటనే ఎవరితో సినిమా చేస్తారనే విషయాన్ని అనౌన్స్ చేయలేదు. పైగా ప్రస్తుతం దర్శకులంతా బిజీగా ఉండడంతో.. బన్నీకి డైరెక్టర్ సెట్ అవుతారా..? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా. బన్నీ తన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో చేయబోతున్నారని సమాచారం. రీసెంట్ గా అల్లు అర్జున్ ని కలిసి ఓ లైన్ చెప్పి ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నారు త్రివిక్రమ్.

సుకుమార్ తరువాత బన్నీ ఎక్కువ సినిమాలు త్రివిక్రమ్ తోనే చేశారు. ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ ఇలా వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలిసి పని చేయాలనుకుంటున్నారు. ‘పుష్ప2’ లాంటి యాక్షన్ ఎంటర్టైనర్ తరువాత బన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనుకుంటున్నారు.

ఆ జోనర్ లో త్రివిక్రమ్ కి మంచి పట్టు ఉంది. అందుకే ఆయనతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బన్నీ. మరి ఈ సినిమా గీతాఆర్ట్స్ లో ఉంటుందా..? లేక సితార సంస్థ నిర్మిస్తుందా..? అనే విషయంలో త్వరలోనే క్లారిటీ రానుంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus