Allu Arjun: బన్నీ – త్రివిక్రమ్.. టైమ్ దగ్గరపడింది!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్ సేట్టవ్వడం సినీప్రియుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ కాంబినేషన్లో ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు నాలుగోసారి ఈ కాంబినేషన్‌ భారీ బడ్జెట్ సినిమా కోసం సెట్ అయింది. “జులాయి”, “సన్ ఆఫ్ సత్యమూర్తి”, “అల వైకుంఠపురములో” సినిమాలు బన్నీ కెరీర్ లో బిగ్ హిట్స్ గా నిలిచిన విషయం తెలిసిందే.

Allu Arjun

ఇక కొత్త సినిమా షూటింగ్ విషయానికొస్తే, ప్రీ-ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. ఈ నెల చివరి వారం నుండి అల్లు అర్జున్, త్రివిక్రమ్ సిట్టింగ్ లో పాత్రల రూపకల్పన, స్క్రిప్ట్‌ పైన మరింత చర్చించనున్నారని తెలుస్తోంది. ఇకపోతే జూన్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేసినట్లు టాక్. ఇంతకు ముందెన్నడూ చూడని పాన్ ఇండియా స్థాయి కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని టీమ్ చెబుతోంది.

ఈ హై బడ్జెట్ సినిమాను హారిక & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. అద్భుతమైన టెక్నికల్‌ వాల్యూస్‌తో పాటు, ఈ సినిమాలో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసే విజువల్స్ ఉంటాయని తెలుస్తోంది. కథ, కథనంలో కొత్తదనం కోరుకునే త్రివిక్రమ్ తన మార్క్‌ని మరోసారి చూపించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం భారీ సెట్లను రూపొందించడానికి సిద్ధమవుతున్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ గా థమన్‌ మరోసారి త్రివిక్రమ్‌ చిత్రానికి సంగీతం అందించనున్నాడని ఆ మధ్య టాక్ వచ్చింది. కానీ అనిరుద్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఇక సినిమాను 2026 సమ్మర్‌లో విడుదల చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అద్భుతమైన స్క్రీన్ ప్లే, విజువల్ ఫీస్ట్‌తో ఈ ప్రాజెక్ట్ మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

హిందీలో మన డామినేషన్.. ఏ రేంజ్ లో ఉందంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus