అల్లు అర్జున్, వరుణ్ తేజ్ లతో రిపీటెడ్ గా సినిమా ఆఫర్లు

మెగా ఫ్యామిలీలో ఒక హీరోయిన్ ఎంటర్ అయ్యిందంటే.. ఆ ఫ్యామిలీ హీరోలందరూ ఆమెతో కలిసి నటించడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆ ఇద్దరి తర్వాత మెగా కాంపౌండ్ లో వరుసబెట్టి సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే ఈ లిస్ట్ లో జాయినయ్యేందుకు రెడీ అవుతోంది. వరుణ్ తేజ్ తో కలిసి నటించిన “ముకుందా” ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పూజా హెగ్డే.. అనంతరం తెలుగులో ఒకట్రెండు సినిమాలు చేసినప్పటికీ పెద్ద ఫలితం లేకపోయింది. కానీ.. అల్లు అర్జున్ తో కలిసి నటించిన “దువ్వాడ జగన్నాధం”తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

ఆ తర్వాత అమ్మడు వరుసబెట్టి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నప్పటికీ.. మెగా ఫ్యామిలీ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంది. రీసెంట్ గానే బన్నీతో సెకండ్ సినిమా సైన్ చేసిన పూజా హెగ్డే.. ఇప్పుడు మరో మెగా హీరో వరుణ్ తేజ్ తో మరో సినిమా సైన్ చేసినట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న “వాల్మీకి” చిత్రంలో కథానాయికగా పూజ హెగ్డేను ఫైనల్ చేశారు. అయితే.. ఈ సినిమాలో ఆమె పాత్ర చిన్నదే అయినప్పటికీ.. ఆమె అందుకోసం ఏకంగా రెండు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ కోరడం విశేషం. మరి ఆ రెమ్యూనరేషన్ ఫైనల్ అయిపోతే.. పూజా ఆన్ బోర్డ్ వచ్చేస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus