Allu Sneha Reddy: ఆ ప్రాజెక్ట్ తో బన్నీ భార్య సినిమాల్లోకి వస్తున్నారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బన్నీ భార్య స్నేహారెడ్డి కూడా భర్తకు తగ్గ భార్యగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో వరుస ఫోటో షూట్స్ తో బన్నీ భార్య వార్తల్లో నిలుస్తున్నారనే సంగతి తెలిసిందే. బన్నీ భార్య ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే బన్నీ భార్య స్నేహారెడ్డి త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారంటూ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

మలయాళ స్టార్ హీరోకు జోడీగా బన్నీ భార్యకు సినిమా ఆఫర్ వచ్చిందని మలయాళ ఇండస్ట్రీ నుంచి ఆఫర్ రావడంతో ఈ ఆఫర్ విషయంలో స్నేహారెడ్డి ఎటూ తేల్చుకోలేకపోతున్నారని సమాచారం అందుతోంది. ఈ ఆఫర్ కు ఓకే చెబితే మాత్రం స్నేహారెడ్డి బిజీ హీరోయిన్ అవుతారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు. అయితే బన్నీ ఫ్యాన్స్ మాత్రం స్నేహారెడ్డి బన్నీకి జోడీగా నటిస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు.

ఇన్ స్టాగ్రామ్ లో కూడా బన్నీ భార్యకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి స్నేహారెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. సినిమాల్లో సక్సెస్ సాధిస్తే స్నేహారెడ్డికి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరుగుతుంది. ఇద్దరు పిల్లల తల్లి అయినా స్నేహారెడ్డి యంగ్ గానే కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

ప్రస్తుతం స్నేహారెడ్డి వయస్సు 37 సంవత్సరాలు కావడం గమనార్హం. మరోవైపు బన్నీ ప్రస్తుతం వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అల వైకుంఠపురములో, పుష్ప ది రైజ్ సినిమాల విజయాలతో బన్నీ మార్కెట్ ఊహించని స్థాయిలో పెరిగింది. పుష్ప ది రూల్ సినిమాతో బన్నీ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ చేరే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus