Allu Arjun, Sneha Reddy: అల్లు అర్జున్ భార్య కూడా ఓటు వేయలేదా.. ఏమైందంటే?

నిన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ముఖ్యంగా టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం ఉదయమే పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు అయితే సెలబ్రిటీలు అందరూ కూడా వారి సతీమణులతో కలిసి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో వచ్చారు. మహేష్ బాబు నమ్రత ,ఉపాసన రాంచరణ్, నాగార్జున అమల, ఎన్టీఆర్ ప్రణతి ఇలా అందరూ కూడా వారి భార్యలతో కలిసి పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకున్నారు

కానీ అల్లు అర్జున్ (Allu Arjun) మాత్రమే సింగల్ గా ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈయన తన భార్యతో కలిసి ఓటు వేయడానికి రాలేదు అంటే స్నేహ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోలేదా అంటే ఈమె కూడా ఓటు వేశారు కానీ తన భర్తతో కలిసి ఓటు వేయడానికి రాలేదు. ఈమె కూడా సింగిల్గానే తన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.

ఇలా వీరిద్దరూ కలిసి కాకుండా విడివిడిగా ఓటు హక్కు వినియోగించుకోవడంతో ఎంతోమంది సందేహాలను వ్యక్తం చేస్తున్నారు అయితే వీరిద్దరూ విడివిడిగా ఓటు వేయడానికి కారణం లేకపోలేదు అల్లు అర్జున్ ఓటును బీఎస్ఎన్ఎల్ కేంద్రంలో తన ఓటు హక్కును ఉపయోగించుకోగా స్నేహ రెడ్డికి మాత్రం ఫిలింనగర్ కల్చర్ సెంటర్లో తన ఓటు హక్కు ఉండటంతో అక్కడ ఓటు వేశారు.

ఇలా వీరిద్దరికి వేరువేరు పోలింగ్ కేంద్రాలు రావడంతో విడివిడిగా ఓటు వేశారని అంతకుమించి వీరిద్దరూ కలిసి ఓటు వేయకపోవడానికి కారణం లేదని చెప్పాలి అయితే ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా జంటగా కనిపించే ఈ జంట ఈసారి మాత్రం కనిపించకపోవడంతో అభిమానులకు పలు సందేహాలు వచ్చాయి .కానీ వీరిద్దరూ కలిసి ఓటు వేయకపోవడానికి అదే కారణం అని తెలుస్తుంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus