Allu Sneha Reddy: స్నేహారెడ్డి నిక్ నేమ్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ జోడీలలో బన్నీ స్నేహరెడ్డి జోడీ ఒకటి. ఈ మధ్య కాలంలో స్నేహారెడ్డి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని వార్తలు వినిపించినా అల్లు ఫ్యామిలీ నుంచి ఈ వార్తలకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రాలేదు. అల్లు అర్జున్ స్నేహారెడ్డి ఒకే సినిమాలో కనిపిస్తే తాము ఎంతగానో సంతోషిస్తామని ఫ్యాన్స్ చెబుతున్నారు. అల్లు స్నేహ తాజాగా నెటిజన్లతో ముచ్చటించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బన్నీ ఏమని పిలుస్తారని అడగగా స్నేహారెడ్డి నా భర్త నన్ను క్యూటీ అని పిలుస్తాడని పేర్కొన్నారు.

స్నేహారెడ్డి క్యూట్ గా ఉంటారు కాబట్టి బన్నీ ఆ విధంగా పిలుస్తారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటారా అనే ప్రశ్నకు స్నేహారెడ్డి స్పందిస్తూ అయాన్ తో కలిసి కిచెన్ లో వంట చెయ్యాలని అనుకుంటున్నానని స్నేహారెడ్డి వెల్లడించారు. ఏ ఆహారం ఇష్టమనే ప్రశ్నకు ఇండియన్ ఫుడ్స్ ఇష్టమని ఆమె అన్నారు. ఇష్టమైన ఆహారం ఏంటనే ప్రశ్నకు స్నేహారెడ్డి స్పందిస్తూ తనకు బిర్యానీ అంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు.

గ్లామరస్ ఫోటో షూట్స్ ద్వారా వార్తల్లో నిలుస్తున స్నేహారెడ్డి తన గురించి వైరల్ అవుతున్న నెగిటివ్ కామెంట్లపై స్పందించడానికి అస్సలు ఇష్టపడటం లేదు. స్నేహారెడ్డి మీడియాకు మాత్రం దూరంగా ఉంటున్నారనే సంగతి తెలిసిందే. బన్నీ సినిమాల విషయంలో కూడా ఆమె జోక్యం చేసుకోరని బోగట్టా. స్నేహారెడ్డి ప్రస్తుతం పలు వ్యాపారాలకు సంబంధించిన బాధ్యతలతో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.

కెరీర్ విషయంలో స్నేహరెడ్డికి ఎన్నో ఆశయాలు, లక్ష్యాలు ఉన్నాయని వాటిని నెరవేర్చుకోవాలని ఆమె ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో స్నేహారెడ్డి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. స్నేహారెడ్డి సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి ఇతర హీరోయిన్లు సైతం షాకవుతున్నారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus