థియేటర్ లో రచ్చ చేస్తోన్న ప్లాప్ సినిమా!

అల్లు అర్జున్, వక్కంతం వంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. రెండేళ్లక్రితం తెలుగులో విడుదలైన ఈ సినిమాని డబ్ చేసి ఉత్తరాదిన రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ ని అందుకొని ఆశ్చర్యపరిచింది. ‘సూర్య ది సోల్జర్’ పేరుతో ఇప్పటికే ఈ సినిమా హిందీలో అనువాదమై యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. అక్కడ దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఇటీవల ఉత్తరాదిన థియేటర్లు రీఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొత్త కంటెంట్ అందుబాటులో అందుబాటులో లేకపోవడంతో ‘సూర్య ది సోల్జర్’ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశారు. మొదట నామమాత్రంగానే రిలీజ్ చేసినప్పటికీ.. సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో స్క్రీన్లను పెంచారు. యాభై శాతం ఆక్యుపెన్సీలో కూడా సినిమా చెప్పుకోదగ్గ కలెక్షన్లు రాబట్టడంతో మరిన్ని నగరాల్లో, పట్టణాల్లో సినిమాను రిలీజ్ చేశారు. కొత్తగా రిలీజైన సినిమాలతో పిలిస్తే బన్నీ సినిమాకి ఎక్కువ కలెక్షన్లు వస్తున్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

కలెక్షన్ల వివరాలు కూడా వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఉండే బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఈ సినిమాకి మంచి స్పందన వస్తోందట. తెలుగులో ప్లాప్ అయిన ఈ సినిమాకి ఉత్తరాదిన ఇలాంటి స్పందన రావడం విశేషమే. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ అనే సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus