‘డిజె’ కు కూడా ఇంత ట్రెండ్ చేసారేందుకో..!

లాక్ డౌన్ వల్ల అందరూ ఇళ్లల్లోనే ఉండడం వలనో ఏమో కానీ.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫ్లాప్ సినిమాల యానివర్సరీ ట్యాగ్ లను కూడా తెగ ట్రెండ్ చేస్తూ వస్తున్నారు. గతంలో ‘వేదం’ ‘ఆర్య2’ ‘ఆరెంజ్’ సినిమాలకు భారీగా ట్రెండ్ చేశారు. ‘ఆ సినిమాలు రాంగ్ టైములో వచ్చాయి. లేకపోతే కచ్చితంగా పెద్ద హిట్ అయ్యుండేవి’ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఫలితం ఎలా ఉన్నా అవి క్లాసిక్సే..! ఈ విషయాన్ని దాదాపు అందరూ ఒప్పుకుంటారు. అయితే మూడేళ్ళ క్రితం వచ్చిన అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’ అదేనండీ ‘డీజె’ చిత్రాన్ని కూడా తాజాగా భారీ ఎత్తున ట్రెండ్ చెయ్యడం గమనార్హం.

హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం.. 2017 జూన్ 23న విడుదలయ్యింది. ‘రొటీన్ రొట్ట సినిమా’ అనే రేంజ్లో కామెంట్స్ చేశారు ప్రేక్షకులు. రివ్యూలు కూడా అలాగే వచ్చాయి. అయితే ఈ సినిమాకి క్యాస్టింగ్ , నిర్మాత దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్ల వంటి వాళ్ళ పై ఉన్న నమ్మకం వంటివి అదనపు హంగులు. అలాగే దేవి శ్రీ సంగీతంలో వచ్చిన పాటలు కూడా మంచి హిట్ అవ్వడంతో..’డీజె’ పై హైప్ బాగా పెరిగింది. అందులోనూ మొదటి వారం హాలిడేస్ రావడం కూడా ఈ సినిమాకి బాగా కలిసి రావడంతో ఓపెనింగ్స్ అయితే వచ్చాయి.

తరువాత మాత్రం అందరూ పెదవి విరిచిన వారే..! ఈ సినిమాకి నష్టాలు వచ్చాయని.. ఓ సందర్భంలో నిర్మాత దిల్ రాజే చెప్పుకొచ్చాడు. ఆ నష్టాల్ని ‘ఫిదా’ చిత్రంతో తీర్చాను’ అని కూడా తెలియజేసాడు. అయితే ఈ సినిమాలో బన్నీ పాత్ర కూడా కెరీర్లోనే బెస్ట్ అన్నట్టు.. ఈ మధ్య డీజె ను ట్రెండ్ చేసే సమయంలో చెప్పుకొచ్చారు. ఇక అన్ సీన్ పిక్స్ కూడా విడుదలవ్వడం మరింత ఆశ్చర్యం కలిగించే విషయం. అసలు ఇంత హడావిడి ఎందుకు చేసారు అనేది సాధారణ ప్రేక్షకులు కూడా అర్ధం కాని వ్యవహారం.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus