వైరల్ అవుతున్న అల్లు అరవింద్ బైక్ ఫొటో!
- January 11, 2021 / 07:14 AM ISTByFilmy Focus
అల్లు అరవింద్ ఆలోచనలు ఎప్పుడూ కుర్రాళ్లను బీట్ చేస్తుంటాయి. సినిమా నిర్మాణం, కథల ఎంపిక విషయంలో అంత అప్‌టుడేట్‌గా ఉంటారాయన. ట్రెండ్‌కి తగ్గ కథలు ఎంచుకుంటూ ప్రొడక్షన్ హౌస్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నారు. తాజాగా యంగ్ ట్రెండ్ ‘ఓటీటీ’లోకి వచ్చి తనెంత యూతో చెప్పకనే చెప్పాడు. అలాంటి ‘యూత్’ అల్లు అరవింద్ ఈ రోజు 72వ పుట్టిన రోజు జరుపుకున్నారు. అవును మీరు చదివింది నిజమే… అరవింద్ వయసు 72.
తండ్రి పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ ఓ ట్వట్ చేశాడు. ‘‘నాన్నా నీకు జన్మదిన శుభాకాంక్షలు. నా జీవితంలో ప్రతి విషయంలోనూ నువ్వు ఉన్నందుకు ఆనందంగా ఉంది. ఈ పుట్టిన రోజుతో నువ్వు మరింత కుర్రాడిలా మారిపోవాలి’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు అల్లు అర్జున్. తండ్రి గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా గొప్పగా చెప్పే బన్నీ… మరోసారి తండ్రి మీద ప్రేమను అందంగా వ్యక్తపరిచాడు.

మరోవైపు మామ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ స్నేహ కూడా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇప్పుడు అందులో ఓ ఫొటోనే ట్రెండింగ్. ఒక పాష్ స్పోర్ట్స్ బైక్ మీద అల్లు అరవింద్ కూర్చొని పోజు ఇచ్చారు. మరో ఫొటోలో భార్యతో కలసి బన్ని పిల్లలతో కనిపించాడు. 72 ఏళ్ల వయసులో కుర్రాడిలా పోజిచ్చిన అరవింద్.. నిజంగానే కుర్రాడే అంటున్నారు నెటిజన్లు.
Most Recommended Video
2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!
















