కిక్, రేసు గుర్రం, టెంపర్ వంటి హిట్ చిత్రాలకి కథ అందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న సినిమా నాపేరు సూర్య. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇందులో సోల్జర్ గా నటిస్తున్నారు. హీరోయిన్ గా అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోన్నఈ చిత్రంలో శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిపై కొన్ని కీలక సన్నివేశాలను హైదరాబాద్ లోని ఓ షాపింగ్ మాల్లో షూట్ చేస్తున్నారు. ఓ వైపు సీరియస్ గా కథ నడుస్తూనే మధ్యలో ఫన్ ని వంశీ మిక్స్ చేస్తున్నారని చిత్ర బృందం తెలిపింది. నిరంతరాయంగా సాగుతున్న ఈ షూటింగ్ ని జనవరి నాటికీ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలెట్టాలని భావిస్తున్నారు.
రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం విశాల్, శేఖర్ పాటలు కంపోజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇందులో బన్నీ క్యారెక్టర్ తో పాటు మ్యూజిక్ సరికొత్తగా ఉండనుంది. చాలా గ్యాప్ తర్వాత మెగా బ్రదర్ కె.నాగబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.