టాలీవుడ్ స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ కమ్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘పుష్ప : ది రూల్’ షూటింగ్ దశలో ఉండగానే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.. బన్నీ – బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్‌ల క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక కాగా.. ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు..
పాండమిక్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ‘పుష్ప’ (Pushpa) క్రియేట్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. 2021లో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.. ‘తగ్గేదే లే’ అంటూ ‘పుష్ప’ రాజ్‌గా బన్నీ నార్త్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు.. ‘పుష్ప’ కి ఏమాత్రం తగ్గకుండా ఇంకా పది రెట్లు అధికంగా అచనాలు ఆకాశాన్నంటేలా తెరకెక్కుతోంది ‘పుష్ప : ది రూల్’.. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు కానుకగా..
కిరాక్ ఫస్ట్ లుక్‌తో పాటు, మూడు నిమిషాల యాక్షన్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు టీమ్.. ఇప్పటికే టీజర్ కట్ చేశారని.. దానికి సంబంధించిన బ్యాగ్రౌండ్ స్కోర్ వర్క్ జరుగుతుందని తెలుస్తోంది.. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.. త్వరలో ఓ భారీ షెడ్యూల్ కోసం అబ్రోడ్ వెళ్లబోతున్నారని తెలుస్తోంది.. ఇదిలా ఉంటే ‘పుష్ప – 2’ కి సంబంధించి క్రేజీ న్యూస్ ఒకటి ఫిలిం వర్గాల్లో వైరల్ అవుతోంది.. థియేట్రికల్, డిజిటల్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది..
బయ్యార్లు ఫ్యాన్సీ రేట్ ఆఫర్ చేస్తున్నారట.. ఇక డిజిటల్ రైట్స్ కోసం కూడా పలు ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయట.. ఇలా టాక్స్ నడిచిన తర్వాత ఓ పాపులర్ ఓటీటీ సంస్థ కళ్లు చెదిరే ధరకు హక్కులు సొంతం చేసుకుందంట.. మేకర్స్ రూ. 200 కోట్లు కోట్ చేశారట.. దీంతో నెట్ ఫ్లిక్స్.. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల డిజిటల్ రైట్స్ ఆ ధరకే తీసుకుందని అంటున్నారు..