‘పుష్ప’ సెట్ లు ఇంకా రెడీ కాలేదట!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పటివరకు మళ్లీ మొదలుకాలేదు. అన్ లాక్ లో భాగంగా హీరోలందరూ ధైర్యం చేసి బయటకి వచ్చి షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ‘పుష్ప’ టీమ్ కూడా షూటింగ్ కి రెడీ అయింది. దీనికోసం ఈ నెల 5వ తారీఖు నుండి రంపచోడవరం, మారేడుమిల్లి వంటి ప్రాంతాల్లో షూటింగ్ ప్లాన్ చేశారు.

వూడ్స్ రిసార్ట్, రాజమండ్రిలో కొన్ని హోటల్స్ ను బ్లాక్ చేశారు. కానీ మళ్లీ సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ నెల 8 లేదా 9 నుండి ‘పుష్ప’ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం. షూటింగ్ ఆలస్యం అవుతుండడానికి కారణం.. అటవీ ప్రాంతంలో వేయాల్సిన సెట్ లు రెడీ కాకపోవడమేనని తెలుస్తోంది. ఈ సెట్ లు పూర్తి కావడానికి మరో నాలుగైదు రోజులు పడుతుందని తెలుస్తోంది. దీంతో ఈ నెల 9వ తారీఖు నుండి షూటింగ్ ప్రారంభించే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఈ షెడ్యూల్ లో సినిమాకి సంబంధించిన కీలక ఫైట్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దీంతో ఈ సెట్ ల విషయంలో ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగేఈ సినిమాలో బన్నీ చిత్తూరు యాసలో సంభాషణలు పలకనున్నారు. బన్నీకి జంటగా రష్మిక ఈ సినిమాలో కనిపించనుంది. రాక్‌స్టార్ దేవీవ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus