సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అల్లు అర్జున్ కొత్త వీడియో

అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకంటే తన పిల్లల వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంటాడనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్-అల్లు అర్హల సరదా సంభాషణల వీడియోలైతే ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అయితే.. ఇటీవల అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ను ట్యాగ్ చేసి.. “మా అబ్బాయి నీకు పెద్ద అభిమాని, నిన్ను టైగర్ ష్రాఫ్ అని కాక టైగర్ స్క్వాష్ అంటాడు” అని చెప్పుకొచ్చాడు. సదరు వీడియోకి స్పందించిన టైగర్ ష్రాఫ్ తనను టైగర్ స్క్వాష్ అనడం నచ్చిందని.. తన షూటింగ్ కి ఎప్పుడైనా అల్లు అయాన్ రావోచ్చని ఇన్విటేషన్ ఇచ్చాడు. ఈ సరదా వీడియో చాట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం మొదలెట్టింది.

ఇకపోతే.. టైగర్ ష్రాఫ్ పరిచయ చిత్రం “హీరో పంటి” అల్లు అర్జున్ కెరీర్ లో ఒన్నాఫ్ ది ప్రామినెంట్ ఫిలిమ్ గా చెప్పుకొనే “పరుగు” రీమేక్ కావడం విశేషం. మరి ఆ సినిమా టైమ్ నుండే బన్నీ-టైగర్ లు కాంటాక్ట్ లో ఉన్నారా లేదా అనేది తెలియదు కానీ.. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒక ఫ్రేమ్ లో కనిపిస్తే మాత్రం రచ్చ మామూలుగా ఉండదు.


యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus