క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారికి అండగా అల్లు శిరీష్!

సాధారణంగా సినిమా సెలబ్రిటీలు తమ అభిమానులు ఏదైనా ఆపదలో ఉన్నారు అంటే వారికి తమదైన శైలిలో సహాయం చేస్తూ వారికి అండగా నిలుస్తూ ఉంటారు. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు ఎంతోమంది అభిమానులకు ఆర్థికంగా అండగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా నటుడు అల్లు శిరీష్ సైతం తన మంచితనాన్ని మానవత్వాన్ని చాటుకున్నారు. అల్లు శిరీష్ తాజాగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి చిన్నారికి అండగా నిలిచి ఆ చిన్నారికి ఆర్థిక భరోసా కల్పించారు.

హైదరాబాదులో ఓ చిన్నారి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుందని అయితే ఆర్థిక సమస్యల కారణంగా సరైన చికిత్స అందలేదని తెలుసుకున్నటువంటి శిరీష్ వారిని తన ఆఫీసుకు పిలిపించి వారితో మాట్లాడి వారికి అండగా నిలిచారు. ఇలా ఓ చిన్నారి ప్రాణాలను కాపాడటానికి అల్లు శిరీష్ తన వంతు సహాయం ప్రకటించారు. ఈ విధంగా శిరీష్ చిన్నారికి అండగా నిలవడంతో తన తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ విషయం తెలియడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు అల్లు శిరీష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అల్లు శిరీష్ మంచి మనసు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా మనకున్న దాంట్లో కొంత పక్క వారికి సహాయం చేస్తే దానిలో వచ్చే సంతృప్తి వేరు అంటూ పలువురు ఈ విషయంపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

అల్లు అరవింద్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు శిరీష్ ఇప్పటివరకు సరైన హిట్ పడలేక ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు. అయితే గత ఏడాది ఈయన నటించిన ఊర్వశివో… రాక్షసివో సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్నారు. అయితే వచ్చిన అవకాశాలని వినియోగించకుండా లేటుగా అయినా మంచి సినిమాలు చేయాలన్న ఆలోచనలో శిరీష్ ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన స్క్రిప్ట్ వినే పనులలో బిజీ అయ్యారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus