యవ కథానాయకుడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న తనయుడు అల్లు శిరీష్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అక్టోబరు 31న మధ్యాహ్నం ఇరుకుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అయితే వేడుకకు సంబంధించిన పొటోలను అల్లు శిరీష్, శిరీష్‌కి కాబోయే భార్య నయనిక రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
నయనికతో ఏడడుగుల బంధాన్ని త్వరలో ప్రారంభిస్తున్నట్లు గత నెల ప్రారంభంలో శిరీష్ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసింఏద. ఇక నయనిక ఇంట్లో జరిగిన ఎంగేజ్‌మెంట్‌కు అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ హాజరైంది. అల్లు అర్జున్, రామ్‌చరణ్ దంపతులు ఈ కార్యక్రమానికి ప్రధానంగా నిలిచారు అని సమాచారం. ఇక గత కొన్నాళ్లుగా శిరీశ్ పెళ్లిపై పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఎప్పుడూ వాటిపై స్పందించలేదు. ఎట్టకేలకు తనే తన పెళ్లి విషయాన్ని ప్రకటించాడు. పెళ్లి తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.
వివాహాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్‌లా చేసుకుందామని శిరీష్ – నయనిక ప్లాన్ చేసుకుంటున్నారట. అయితే అది మన దేశంలోనా లేక విదేశాల్లోనా అనేది తేలాల్సి ఉంది. శిరీష్ విషయానికొస్తే ‘బడ్డీ’ సినిమాతో చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత కొత్త సినిమాలేవీ ఓకే చేయలేదు. ముంబయిలో ఉంటూ తమ సంస్థ కార్యకలాపాలు చూసుకుంటున్నాడు అని సమాచారం. ఇక నయనిక హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తనయ.