Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ అనే కమర్షియల్ సినిమా రూపొందింది. రవితేజ కెరీర్లో ఇది 75వ సినిమా కావడంతో ప్రత్యేకతను సంతరించుకుంది. టీజర్, ట్రైలర్ వంటివి బాగున్నాయి. శ్రీలీల ఇందులో హీరోయిన్. భీమ్స్ సంగీత దర్శకుడు. వీరి కాంబోలో వచ్చిన ‘ధమాకా’ సూపర్ హిట్ అవ్వడంతో ‘మాస్ జాతర’ కూడా అదే రేంజ్లో బ్లాక్ బస్టర్ అవుతుందని అంతా భావించారు.

Mass Jathara

పైగా ‘ధమాకా’ తర్వాత రవితేజ నటించిన ఏ సినిమా కూడా విజయం సాధించలేదు. అందువల్ల ‘మాస్ జాతర’ కచ్చితంగా హిట్టు కొట్టాలని ఇండస్ట్రీ జనాలతో పాటు రవితేజ అభిమానులు కూడా కోరుకున్నారు. నవంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది. ఈరోజు అనగా అక్టోబర్ 31 సాయంత్రం నుండి ప్రీమియర్ షోలు వేశారు.ఆల్రెడీ చాలా చోట్ల షోలు పడ్డాయి. ఈ క్రమంలో కొంత మిక్స్డ్ రెస్పాన్స్ వినిపిస్తుంది.

మనం కూడా ఒకసారి ‘మాస్ జాతర’ లోని ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా ప్లస్ పాయింట్స్ 

1) డౌన్ లేకుండా ఫస్ట్ ప్లస్ పాయింట్ మాస్ మహారాజ్ రవితేజ పెర్ఫార్మన్స్. ఈ సినిమాలో చాలా యంగ్ గా కనిపించాడు. ఫైట్స్, డాన్స్.. విషయంలో తన మార్క్ ఎనర్జీ మిస్ అవ్వకుండా తన వరకు 100 శాతం ఎఫర్ట్ పెట్టి చేశాడు. కాకపోతే రవితేజ మార్క్ కామెడీ టైమింగ్ ను దర్శకుడు భాను భోగవరపు సరిగ్గా వాడుకోలేదు అనిపిస్తుంది. ఆ విషయంలో దర్శకుడు జాగ్రత్త పడి ఉంటే కచ్చితంగా ఈ సినిమాకి రవితేజ సేవియర్ అయిపోయేవాడు. పైగా ల్యాండ్ మార్క్ సినిమా కాబట్టి.. అది మిస్ అయ్యింది అనే లోటు కూడా ఉండిపోయినట్లు అయ్యింది.

2)నవీన్ చంద్ర విలనిజం ఈ సినిమా హైలెట్స్ లో ఒకటి. అతని మేకోవర్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ ‘అరవింద సమేత’ లో బాల్రెడ్డిని తలపించాయి. కానీ ఇతని క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ విషయంలో కూడా దర్శకుడు తడబడ్డాడు. అలాగే శివుడు పాత్రకు ఇచ్చిన ఎండింగ్ కూడా సెట్ అవ్వలేదు.

3) ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది. రైల్వే స్టేషన్లో వచ్చే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.

4)భీమ్స్ సంగీతంలో రూపొందిన పాటలు బాగున్నాయి. ‘తుమేరా లవర్’ ‘సూపర్ డూపర్ హిట్ సాంగ్’ పాటలు మాస్ ఆడియన్స్ తో చిందులు వేయించే విధంగా ఉన్నాయి.

5) ప్రీ క్లైమాక్స్ లో విలన్ రిలేటివ్స్ తో వచ్చే ఫైట్ సీన్ బాగుంది. ఆ తర్వాత విలన్ ఇంటికి వెళ్లి భోజనం చేస్తూ హీరోకి ధమ్కీ ఇచ్చే ఫైట్ సీన్ కూడా మాస్ ఆడియన్స్ ని అలరించడం ఖాయం.

6) నిర్మాత నాగవంశీ ఖర్చుకి వెనకాడకుండా ఈ సినిమాని తెరకెక్కించాడు. ప్రతి సీన్లోనూ అతను పెట్టిన రూపాయి కనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్

7) దర్శకుడు భాను భోగవరపు కథకుడిగా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే పాయింట్ ను తీసుకున్నాడు. కానీ దర్శకుడిగా మాత్రం ఎగ్జిక్యూషన్ విషయంలో తడబడ్డాడు. అందువల్ల భారీగా ఎలివేట్ అవ్వాల్సిన సన్నివేశాలు సాదా సీదాగా అనిపిస్తాయి.

8) సినిమాలో కామెడీ తేలిపోయింది. బోలెడంత మంది కమెడియన్స్ ఉన్నప్పటికీ.. ఒక్క పంచ్ కూడా పేలలేదు. హైపర్ ఆది, చమ్మక్ చంద్ర వంటి వాళ్ళ కామెడీ టైమింగ్ ను కూడా దర్శకుడు వాడుకోలేకపోయాడు.

9) రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ ను సరిగ్గా డిజైన్ చేయలేదు. మొదటి నుండి ఈ క్యారెక్టర్ ను ఫన్ మోడ్ లో చూపించి చివరికి సీరియస్ గా ఎండ్ చేశాడు. కానీ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విధంగా ఈ పాత్ర లేదు.

10) ఫస్ట్ హాఫ్ చాలా ఫ్లాట్ గా ఉంది. మెయిన్ పాయింట్ మొదలవ్వడానికి చాలా టైం పట్టింది.అలాగే కొన్ని క్యారెక్టర్లు ఎందుకు ఉన్నాయో కూడా అర్ధం కాదు. ఉదాహరణకి సముద్రఖని ఉన్నాడు ఈ సినిమాలో. అది జస్ట్ హీరోని ట్రాన్స్ఫర్ చేసే పాత్ర. ఆ మాత్రం దానికి సముద్రఖని వంటి కాస్ట్లీ నటుడు ఎందుకు? కొత్త నటుడైనా ఆడియన్స్ కి అదే ఫీలింగ్ ఉంటుంది కదా. సముధ్రఖని వంటి స్టార్ ని పెట్టినప్పుడు ఆ రేంజ్ ఇంపాక్ట్ ఫుల్ పాత్ర ఉండాలి అనుకుంటారు కదా ఆడియన్స్. అలాంటి పాత్రలు చాలానే ఉన్నాయి ఈ సినిమాలో. ఎవరు ఎందుకు వస్తారో? ఎందుకు వెళ్ళిపోతారో తెలీక ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు.

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus