మనం తీసుకున్న నిర్ణయాలు కొన్ని సార్లు ఆనందాన్ని ఇస్తాయి. మరికొన్ని సార్లు బాధని పంచుతాయి. పాఠాన్ని నేర్పిస్తాయి. అలా బాధపడుతూ ఓ పాఠాన్ని నేర్చుకున్నారు మన అల్లు శిరీష్. అసలే చేసిన సినిమాలు హిట్ కాక, మంచి కథలు వెతుక్కోవడంలో బిజీగా ఉన్న సమయంలో తనకు ఓ విషయం చిరాకు పెట్టిస్తోంది. అదేంటో వివరాల్లోకి వెళితే… గతంలో ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌ను అల్లు శిరీష్ వాడుతూ వచ్చారు. అయితే, ఆ నెట్‌వర్క్ బాగోలేదని మొబైల్ పోర్టబులిటీ ద్వారా వోడాఫోన్ నెట్‌వర్క్‌కు మారారు. ఈ నెట్‌వర్క్ మరింత అధ్వాన్నంగా ఉండటంతో అల్లు శిరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికపై తన కోపాన్ని వెళ్లగక్కారు. “దేని విలువైనా అది నీ దగ్గరున్నంత కాలం తెలియదు. ఈమధ్యే ఎయిర్‌టెల్ నుంచి వోడాఫోన్ నెట్ వర్క్ కి మారాను.
నా పరిస్థితి బ్యాడ్ నుంచి వరస్ట్ అయింది. 4జీ గురించి మరచిపోండి. కనీసం 2జీ సిగ్నల్స్ కూడా అందడం లేదు. కాల్ డ్రాప్స్ సంగతి పక్కనబెట్టండి. కనీసం సిగ్నల్ కూడా అందని పరిస్థితి. చాలా బాధపడుతున్నాను. ఓ పాఠం నేర్చుకున్నాను” అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సామాన్యులు ఇదే పోస్ట్ పెడితే సదరు కంపెనీ వాళ్ళు లైట్ తీసుకుంటారేమో గానీ.. సెలబ్రిటీ హోదాలో ఉన్న శిరీష్ చేసిన ట్వీట్ ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటారు. వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అందరూ వెయిటింగ్ చేస్తున్నారు.