Allu Sirish, Arjun: బన్నీ సీక్రెట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అల్లు శిరీష్?

తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు కుటుంబానికి ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అరవింద్ వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ అల్లు శిరీష్ సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందగా అల్లు శిరీష్ తెలుగు చిత్ర పరిశ్రమలో పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే అల్లు శిరీష్ 2019లో నటించిన ఊర్వశివో రాక్షసివో అనే సినిమా నవంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అల్లు శిరీష్ బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ తాను నటించిన మొదటి సినిమా గౌరవం సినిమా చూసినటువంటి 98% సినిమా బాగాలేదన్న బాధపడలేదు కానీ మిగిలిన రెండు శాతం మంది సినిమా నచ్చిందని చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని తెలిపారు.

ఇక ఊర్వశివో రాక్షసివో సినిమా గురించి మాట్లాడుతూ ఇందులో లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయట కదా ఎన్ని టేకులలో పూర్తి చేశారంటూ ప్రశ్నించారు. అలీ ఈ విధంగా అడిగేసరికి శిరీష్ ఏం చెప్పాలో తెలియక తల పట్టుకున్నారు.ఇక అల్లు అర్జున్ గురించి ప్రస్తావనకు తీసుకువచ్చి అల్లు అర్జున్ ప్రతి ఒక్క సీక్రెట్ నీకు చెప్తారంట కదా అని ప్రశ్నించారు.

అవును అనే శిరీష్ సమాధానం చెప్పగా మరి వదినకు తన సీక్రెట్ చెప్తావా అని ప్రశ్నించడంతో వదిన నాకు గన్ గురిపెట్టినా కూడా అన్నయ్య సీక్రెట్స్ తనకి చెప్పనంటూ ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus