అల్లు అరవింద్ చిన్న కుమారుడు, అల్లు అర్జున్ తమ్ముడు అయినటువంటి అల్లు శిరీష్.. త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఇటీవల అతను నైనికా అనే అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు తెలిపి ఇండస్ట్రీ మొత్తాన్ని సర్ప్రైజ్ చేశాడు. అతని తాతగారు అల్లు రామలింగయ్య జయంతి నాడు ‘నైనిక అనే అమ్మాయితో త్వరలో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు.నాయనమ్మ చివరి కోరిక తీర్చబోతున్నట్టు తెలిపాడు.
ఇక హైదరాబాద్లో ఈరోజు అనగా అక్టోబర్ 31న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో అల్లు శిరీష్- నైనికా..ల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. పెద్దలందరి ముందు కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకలో అల్లు అరవింద్ అండ్ ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా సందడి చేశారు.చిరంజీవి- సురేఖ..లతో పాటు రామ్ చరణ్–ఉపాసన, వరుణ్ తేజ్–లావణ్య త్రిపాఠి.. ఇలా అందరూ హాజరయ్యారు.
ఇటీవల భారీ వర్షాలు కురవడంతో ఈ ఈవెంట్ ను చాలా సింపుల్ గా నిర్వహించారు. పెళ్లి తేదీపై త్వరలోనే క్లారిటీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.ఇక శిరీష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నైనిక బ్యాక్ గ్రౌండ్ చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఆమె తోడికోడలు అల్లు స్నేహ మాదిరి ఈమె కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయే. 2 ఏళ్ళ నుండి శిరీష్ తో నైనిక డేటింగ్లో ఉంది.
ఆమె తండ్రి రియల్ ఎస్టేట్ అలాగే కన్స్ట్రక్షన్ బిజినెస్లో బాగా సంపాదించారు. వీళ్ళకి ఇంకా చాలా బిజినెస్..లు ఉన్నాయి.