మెగాస్టార్ చిరంజీవి హీరోగా విజయశాంతి హీరోయిన్ గా వచ్చిన ఆల్ టైం సూపర్ హిట్ మూవీ పసివాడి ప్రాణం. 1987 జూలై 23 న విడుదలైన ఈ చిత్రాన్ని కోదండ రామిరెడ్డి డైరెక్ట్ చెయ్యగా.. గీత ఆర్ట్స్ సంస్థ పై అల్లు అరవింద్ గారు నిర్మించారు. అయితే ఈ చిత్రానికి బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సల్మాన్ ఖాన్ బజ్రంగీ భాయ్ జాన్ కు లింక్ పెడుతూ ఓ హాట్ డిస్కషన్ రన్ అవుతుంది. అది కూడా హీరో అల్లు శిరీష్ వల్ల. ఇటీవల అల్లు సిరీస్ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన గురించి వివరించాడు.
తనకి 5 లేదా 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు.. ఓ చోట తప్పిపోయాడట.అప్పుడు వాళ్ల అమ్మ వెదుక్కుంటూ తిరిగి వచ్చేవరకూ సైలెంట్ గా ఎక్కడున్నాడో అక్కడే ఉండిపోయాడట.చివరికి వాళ్ళ అమ్మ తిరిగి వచ్చాక… చుట్టూ ఉన్న వారికి నువ్వు తప్పిపోయినట్టు చెప్పొచ్చు కదా? అని అడగ్గా.. అలా చెబితే ఎవరైనా తనని కిడ్నాప్ చేసే అవకాశం ఉందని భయపడి చెప్పలేదని సమాధానం ఇచ్చాడట. చాలా చిన్న వయస్సులోనే శిరీష్ కు అంత అవగాహన రావడానికి కారణం .
మెగాస్టార్ ‘పసివాడి ప్రాణం’ సినిమా అని తెలిపాడు! ఇదే క్రమంలో ఆ సినిమాని ఆధారం చేసుకునే సల్మాన్ ఖాన్ బజ్రంగీ భాయ్ జాన్ ను తెరకెక్కించారని ఓ సంచలన కామెంట్ చేశాడు.దాంతో బాలీవుడ్ మీడియా షాక్ తింది. నిజమే మరి.. అందుకే మన తెలుగు దర్శకులు ఆ సినిమాని రీమేక్ చేసే ప్రయత్నాలు చెయ్యలేదు. అంతేకాదు పసివాడి ప్రాణం సినిమా స్ఫూర్తి తోనే సుప్రీమ్ చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు మన అనిల్ రావిపూడి. అది కూడా సూపర్ హిట్టే.
Most Recommended Video
రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!