శ్రీవిష్ణు ఈ మధ్య కాలంలో ఒక్క హిట్టు కొట్టడానికి చాలా తిప్పలు పడుతున్నాడు. ‘అర్జున ఫల్గుణ’ ‘భళా తందనాన’ వంటి చిత్రాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని ‘అల్లూరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ యంగ్ హీరో. ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘లక్కీ మీడియా’ బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించగా… బెక్కెం బబిత సమర్పకులుగా వ్యవహరించారు.
సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ చిత్రం పై పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు.అందుకే థియేట్రికల్ బిజినెస్ కూడా సో సో గా జరిగింది. ఒకసారి వాటి వివరాలను గమనిస్తే :
నైజాం
1.10 cr
సీడెడ్
0.35 cr
ఉత్తరాంధ్ర
0.45 cr
ఈస్ట్
0.25 cr
వెస్ట్
0.20 cr
గుంటూరు
0.30 cr
కృష్ణా
0.35 cr
నెల్లూరు
0.22 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
3.22 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్
0.20 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
3.42 cr
‘అల్లూరి’ చిత్రానికి రూ.3.42 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.3.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. శ్రీవిష్ణు నటించిన గత రెండు చిత్రాలు ‘అర్జున ఫల్గుణ’ ‘భళా తందనాన’ ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. ‘అల్లూరి’ చిత్రానికి ఫైనాన్సియల్ ఇష్యూస్ కూడా నెలకొన్నాయి అని వినికిడి. అందువల్ల షోలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
అవన్నీ క్లియర్ అయ్యి ఈ మూవీ షోలు పడి పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంటే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం నాడు ‘నేషనల్ సినిమా డే’ సందర్భంగా టికెట్ రేట్లు చాలా తగ్గించారు. కాబట్టి మొదటి రోజు ఎక్కువ మంది సినిమా చూసే అవకాశాలు ఉన్నాయి.