పౌరాణిక చిత్రాలు చేస్తాను : మహేష్ బాబు

  • May 25, 2016 / 05:26 AM IST

నేటి తరం హీరోలు పౌరాణిక చిత్రాలు చేయడానికి ఇష్టపడరు. అటువంటి చిత్రాలను ఈ కాలంలో ఆడియన్స్ చూడరేమోనని వారి నమ్మకం. అంతే కాదు అలనాటి మాయాబజార్, వెంకటేశ్వర మహత్యం, సీతారం కళ్యాణం, నర్తనశాల లాగా ఇప్పటి దర్శకులు తీయగలరా? అని ఎక్కడో అనుమానం ఉంటుంది. అందుకే రిస్క్ తీసుకోవడానికి వెనుకాడుతారు. నందమూరి బాలకృష్ణ, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తీసిన పాండు రంగడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించలేక పోయింది. దీంతో మైథలాజికల్ మూవీ జోలికి వెళ్ళడం లేదు. కాని లేటెస్ట్ గా ఒక షోలో సూపర్ స్టార్ మహేష్ బాబు తాను పౌరాణిక చిత్రాలు చేయడానికి సిద్ధమేనని చెప్పారు. కాని అది దర్శకులు ఎవరు అనే దాని పై ఆధారపడి ఉంటుందని, రాజమౌళి లాంటి వారు వస్తే తప్పకుండా చేస్తానని వెల్లడించారు.

తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించ దగ్గ దర్శకుల్లో రాజమౌళి ఒకరు. ఆయన ఏ జాన్రలో కథ తీసుకున్నా హిట్ సాధిస్తున్నారు. జానపద కథకి గ్రాఫిక్స్ ని జోడించి అద్భుత కళాఖండాన్ని సృష్టించారు. బాహుబలి ద్వారా తెలుగు సినిమాల సత్తాను ప్రపంచానికి చాటారు. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా చెన్నైలోని మేనేజ్ మెంట్ స్టూడెంట్స్ తో రాజమౌళి మాట్లాడుతూ మన పురాణాలను తెరకేక్కించే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. మహా భారతాన్ని వెండి తెరపై గ్రాఫిక్స్ జోడించాలనేది ఆయన కలగా వెల్లడించారు.

ప్రిన్సు, జక్కన్న మాటలు వింటుంటే ఫ్యూచర్లో వీరిద్దరి కాంబినేషన్లో ఒక మైథలాజికల్ మూవీ రావచ్చొని ఆశించవచ్చు. ఇప్పటికే మహేష్ బాబుని అభిమానులు కృష్ణుడిగా పోస్టర్లు డిజైన్ చేసారు. ఆ పాత్రకు మహేష్ సూటవుతారని చెప్పేశారు. మరి రాజమౌళికి మహేష్ ఏ విధంగా కనిపిస్తారో వేచి చూడాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus