Am Rathnam: కిరణ్ అబ్బవరం సినిమాతో సంబంధం లేనట్టు మాట్లాడిన నిర్మాత..!

వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు కిరణ్ అబ్బవరం. ఈ ఏడాది ఆల్రెడీ వినరో భాగ్యము విష్ణుకథ అనే డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మీటర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. దీంతో తన నెక్స్ట్ సినిమా అయిన రూల్స్ రంజన్ పై ఫోకస్ పెట్టాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నేహా శెట్టి నటించింది. ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ సమ్మోహనుడా అనే పాట చార్ట్ బస్టర్ అయ్యింది.

అయినప్పటికీ ఈ సినిమా పై జనాల ఫోకస్ అంతగా లేదు. ఎందుకంటే ట్రైలర్ ఇంకా రిలీజ్ కాలేదు. ఈ మూవీ గురించి పెద్దగా చర్చలు కూడా ఇప్పటి వరకు జరిగింది లేదు. కానీ ఈరోజు ఎక్కువగా చర్చల్లో నిలిచింది ఈ సినిమా. ఎందుకంటే రూల్స్ రంజన్ సెప్టెంబర్ 28 న ధియోటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్టు చిత్ర బృందం ఒక ఈవెంట్ పెట్టి మరీ అనౌన్స్ చేసింది చిత్ర బృందం. వాస్తవానికి ఆ డేట్ కి ప్రభాస్ సలార్ సినిమా రావాలి.

కానీ అది పోస్ట్ పోన్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయినప్పటికీ ఈవెంట్ పెట్టి మరీ రూల్స్ రంజన్ సెప్టెంబర్ 28న రిలీజ్ డేట్ ఫిక్స్ అని చెప్పారు. అంతేకాదు ఈ సినిమాకి సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఏ.ఎం.రత్నం మాత్రం.. అసలు ఈ కథ వినలేదు అని, తన కొడుకు సినిమా కాబట్టి ముందుగానే తన పేరు వేసుకున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. కాబట్టి.. రూల్స్ రంజన్ విజయం పై ఏ.ఎం.రత్నంకి (Am Rathnam) కూడా నమ్మకం లేదు అని స్పష్టమవుతోంది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus