Amala: చాలా రోజుల తర్వాత వేదికపై డాన్స్ చేస్తూ సందడి చేసిన అమల వీడియో వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీ కపుల్స్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి అమల నాగార్జున దంపతుల జంట ఒకటి అని చెప్పాలి వీరీద్దరు కలిసి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ విధంగా పలు సినిమాలలో నటించినటువంటి ఈ జంట అనంతరం వివాహం చేసుకొని నిజజీవితంలో కూడా ఒక్కటయ్యారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగినటువంటి ఈమె వివాహం తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి అమల (Amala) కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ఇంటికే పరిమితం అయ్యారు అయితే చాలా సంవత్సరాలు తర్వాత ఈమె లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక తాజాగా శర్వానంద్ నటించిన ఓకే ఒక జీవితం సినిమాల్లో కూడా సందడి చేశారు. ఇలా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ అధిక ప్రాధాన్యత కుటుంబానికి ఇస్తూ సినిమాలలో నటిస్తున్నటువంటి అమల తాజాగా అన్నపూర్ణ సినిమా కాలేజీలో జరిగినటువంటి ఓ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తూ అందరిని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనటువంటి అమలా సైతం వేదికపై డాన్స్ చేస్తూ అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక ఈమె స్వయంగా తన భర్త నాగార్జున నటించిన హలో బ్రదర్ సినిమాలోని ప్రియురాగాలే అనే పాటకు వేదికపై చేసినటువంటి డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా చాలా రోజుల తర్వాత అమల వేదికపై ఇలా డాన్స్ చేయడంతో ఈ వీడియో చూసిన వారందరూ ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సూపర్ మేడం అంటూ కామెంట్ చేస్తున్నారు.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus