చాలా గ్యాప్ తర్వాత వస్తున్న స్నేహా ఉల్లాల్, అమలా పాల్!

  • December 19, 2017 / 08:14 AM IST

జూనియర్ ఐశ్వర్య రాయ్ గా పేరుతెచ్చుకున్న స్నేహా ఉల్లాల్ తెలుగులో కరెంట్, అలా మొదలైంది, సింహ వంటి హిట్స్ అందుకుంది. అయినా కెరీర్ ఊపందుకోలేదు. అందుకే కొన్ని రోజులు నటనకు బ్రేక్ ఇచ్చింది. ఆమె చేసిన ఆఖరి చిత్రం “అంతా నీ మాయలోనే”. ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. ఇక ప్రేమ ఖైదీ, ఇద్దరమ్మాయిలతో, నాయక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి అమలా పాల్. చేతినిండా సినిమాలు ఉండగానే పెళ్లి చేసుకొని.. భర్తతో గొడవలు పడి విడాకులు తీసుకుంది. ఈ కోర్టుకు తిరిగి పనిలో సినిమాలను ఒప్పుకోలేదు. ఆమె తెలుగులో చేసిన ఆఖరి చిత్రం “జెండాపై కపిరాజు”.

ఇది 2015 లో రిలీజ్ అయింది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడంతో వృత్తిపైన ఫోకస్ పెట్టింది. అమల పాల్ లేటెస్ట్ గా చేస్తున్న మూవీ “ఆయుష్మాన్ భవ”. ఇందులో స్నేహ ఉల్లాల్ కూడా నటిస్తోంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా  ఆయుష్మాన్ భవ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ తోనే హీరోయిన్ క్యారెక్టర్ ఏంటో తెలిసేలా ఒక స్టేట్‌మెంట్ కూడా ఇచ్చేశారు. ‘వైశాలి అంటే ట్రెడిషనల్‌ అనుకుంటున్నారా..? పిచ్చ పోష్‌! ఫిగర్‌ అదరిపోద్ది’ అని పోస్టర్‌పై రాసి ఉండటం విశేషం. ఈ ఫోజు చూస్తుంటే స్నేహ ఉల్లాల్ శృతిమించి అందాలు ఆరబోయనున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీలో అమలాపాల్ ముస్లిమ్ యువతిగా నటిస్తోంది. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాని చరణ్ తేజ్ నిర్మిస్తూ హీరోగా నటిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus