Amaran Collections: ‘అమరన్’ మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే..?

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan)  , సాయి పల్లవి (Sai Pallavi)  జంటగా నటించిన ‘అమరన్’ (Amaran)  మొదటి వీకెండ్ చాలా బాగా కలెక్ట్ చేసింది. కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాని రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వం వహించారు. 2014లో వీరమరణం పొందిన గొప్ప సైనికుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా మంచి ఎమోషనల్ కంటెంట్ తో ఈ సినిమా రూపొందింది. 3 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం 4వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసింది.

Amaran Collections

ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 4.15 cr
సీడెడ్ 1.20 cr
ఉత్తరాంధ్ర 1.28 cr
ఈస్ట్+వెస్ట్ 0.53 cr
కృష్ణా + గుంటూరు 0.75 cr
నెల్లూరు 0.23 cr
ఏపి+ తెలంగాణ(టోటల్) 8.14 cr

‘అమరన్’ చిత్రానికి తెలుగులో రూ.4.45 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 3 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం 4 రోజులు ముగిసేసరికి రూ.8.14 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి రూ.3.14 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి ఆల్రెడీ బ్లాక్ బస్టర్ స్టేటస్ ను దక్కించుకుంది ఈ సినిమా. మరి వీక్ డేస్ లో ఎంత వరకు నిలబడుతుందో చూడాలి.

బాలీవుడ్‌ స్టార్‌ నో చెప్పాడు… ప్రభాస్‌ యస్‌ చెప్పాడా? కానీ ఎప్పుడు?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus