Kanguva: చిక్కుల్లో పడ్డ ‘కంగువా’ నిర్మాత.. ఏమైందంటే?

‘కంగువా’ (Kanguva) చిత్రం పై హీరో సూర్య (Suriya)  చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. శివ (Siva) డైరెక్ట్ చేసిన ఈ సినిమా నవంబర్ 14 న విడుదల కానుంది. జ్ఞానవేల్ రాజా ‘యూవీ క్రియేషన్స్’ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. సూర్య కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇది.పాన్ ఇండియా సినిమా కాబట్టి.. కచ్చితంగా వెయ్యి కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసే తమిళ సినిమా అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తున్నారు.

Kanguva

ఇలాంటి టైంలో ‘కంగువా’ ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఈ సినిమా విడుదలని ఆపేయాలంటూ ‘రిలయన్స్ ఎంటర్టైన్మెంట్’ సంస్థ కోర్టుకెక్కింది అని సమాచారం. నిర్మాత జ్ఞానవేల్ రాజా (K. E. Gnanavel Raja) తమకు చెల్లించాల్సిన బాకీ ఇంకా చెల్లించలేదు అని రిలయన్స్ సంస్థ పిటిషన్లో పేర్కొందట. విషయం ఏంటంటే.. నిర్మాత జ్ఞానవేల్ రాజా తన గత సినిమాల కోసం ‘రిలయన్స్’ వారి వద్ద రూ.99.22 కోట్లు అప్పు చేశాడట. ఇప్పటికీ ఇంకా రూ.45 కోట్లు చెల్లించాలట.

కానీ జ్ఞానవేల్ రాజా ఇంకా చెల్లించలేదట. అందుకే వాళ్ళు మద్రాసు హైకోర్టుని ఆశ్రయించారని సమాచారం. ఇక మద్రాసు హైకోర్టు తదుపరి విచారణని నవంబర్ 7 కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. జ్ఞానవేల్ రాజా తెరకెక్కించిన గత 4,5 సినిమాలు పెద్ద ఫ్లాప్ అయ్యాయి. ఆశలన్నీ ‘కంగువా’ పైనే పెట్టుకున్నాడు. ఇలాంటి టైంలో అతనికి ‘రిలయన్స్’ వారు షాక్ ఇవ్వడం జరిగింది. రిలీజ్ టైంకి అడ్డంకులు అన్నీ తొలగిపోతాయేమో చూడాలి.

కరణ్ జోహార్ ప్రశ్న.. బాలయ్య రియాక్షన్ కు దిమ్మతిరిగింది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus