Bigg Boss 7 Telugu: అమర్ కి రెడ్ కార్డ్ ఇస్తున్నారు బిగ్ బాస్ నుంచీ అవుట్ అవుతున్నాడా..?

బిగ్ బాస్ హౌస్ లో పెద్ద పైట్ అయ్యింది. ఫన్ గేమ్ కాస్తా హార్ట్ గేమ్ గా మారిపోయింది. పల్లవి ప్రశాంత్ చేతిని అమర్ దీప్ కొరికాడని పల్లవి ప్రశాంత్ కంప్లైట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. అసలు ఏం జరిగిందంటే., బిగ్ బాస్ ఓట్ అప్పీల్ కోసం టాస్క్ లు పెడుతున్నాడు. ఇందులో భాగంగా ఫస్ట్ బిగ్ బాస్ ఎలా ఉంటాడో ఊహించి స్కెచ్ గీయమని చెప్పాడు. అందరూ వారి వారి ఊహకి తగ్గట్లుగా స్కెచ్ గీశారు.

ఆతర్వాత జాకెట్ బాల్ టాస్క్ మొదలైంది. స్క్రిప్పర్స్ తో అంటించిన జాకెట్స్ ని వేస్కుంటే బాల్స్ ని త్రో చేయాల్సి ఉంటుంది. ఎవరి జాకెట్ కి అయితే ఎక్కువ బాల్స్ అంటుకుంటాయో వాళ్లు రౌండ్ నుంచీ తప్పుకుంటారు. ఇలా ప్రతి రౌండ్ లో ఒక్కొక్కరు తప్పుకుంటారు. లాస్ట్ వరకూ ఉన్నవాళ్లు గేమ్ లో ముందుకు వెళ్తారు. ఇక్కడే అందరికీ ఆవేశం వచ్చింది. ఫన్ గా ఆడాల్సిన టాస్క్ ని రచ్చ రచ్చ చేసుకున్నారు. ఫస్ట్ శోభాశెట్టి ఇంకా యావర్ ఇద్దరూ కూడా అవుట్ అయ్యారు.

వాళ్లిద్దరూ సంచాలక్ గా మారారు. ఆ తర్వాత వాళ్లిద్దరికీ పెద్ద ఆర్గ్యూమెంట్ జరిగింది. అంతేకాదు, శోబాశెట్టికి ఇంకా శివాజీకి మద్యలో కూడా మాటల యుద్ధం అయ్యింది. దీని తర్వాత అమర్ ప్రశాంత్ నిలుచున్న ప్లేస్ లోకి వెళ్లి మరీ తన జాకెట్ ని బాల్స్ తో నింపేశాడు. దీంతో పల్లవి ప్రశాంత్ కూడా ఎదురుదాడి చేశాడు. ఇద్దరికీ ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలోనే పల్లవి ప్రశాంత్ అమర్ కొరికాడు అంటూ కంప్లైట్ ఇచ్చాడు. ఈ కొరకడం అనేది పెద్దగా అయితే మాత్రం బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) టీమ్ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది.

అమర్ దీప్ పై పల్లవి ప్రశాంత్ కంప్లైట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా రెడ్ కార్డ్ ఇచ్చేస్తారు. ప్రస్తుతం ప్రోమోలో చూసినట్లయితే., ప్రశాంత్ అయితే చేతిపైన కొరికేశాడు అనే కంప్లైట్ కూడా ఇచ్చాడు. నేను తప్పని ఒప్పుకుంటా.. కానీ నువ్వు చేసేవి కనిపించవ్ అంటూ అమర్ రెచ్చిపోయాడు. చాలా మాటలు అన్నాడు. నీకన్నా డబుల్ గేమ్ ఎవరికీ లేదని, ఉంటే ఎంత పోతే ఎంత అంటూ పల్లవి పై మాటల దాడి చేశాడు. ఇంకోటి ఏంటంటే.,

వాడు విషయం చెప్పాడు చెప్పద్దని మాట ఇచ్చాడు. అందుకే నేను బయట పెట్టడం లేదు. వేరేవాళ్ల గురించి వాడు ఏం చెప్పాడో తెలుసా ? అంటూ అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ పై నింద వేశాడు. శివాజీ చూస్తూ ఉండిపోయాడు. ఆవేశంతో అమర్ మరోసారి హిస్టీరియా పేషెంట్ లాగా ఊగిపోతుంటే సైలెంట్ గా పల్లవి ప్రశాంత్ నీళ్లు తాగు అంటూ రెచ్చగొట్టాడు. వాడు ఎలాంటి వాడో తెలియాలి కదా అంటూ అమర్ దీప్ ఇంకా రెచ్చిపోయి మరీ అరిచాడు. అసలు గొడవకి కారణం ఏంటంటే.,

అమర్ దీప్ ఇంకా పల్లవి ప్రశాంత్ ఇద్దరూ కూడా చేతులతో జాకెట్ కి అంటుకున్న బాల్స్ తీశారు. నేను తీయలేదని ప్రసాంత్ వాదించాడు. ఇక్కడే చాలాసేపు యావర్ తో ఆర్గ్యూమెంట్ పెట్టున్నాడు అమర్ దీప్. మరోసారి మాడ్ ఎమోషన్ ని చూపించాడు. ఇక అర్జున్ మద్యలో దూరి ఆపాడు. అయితే, ఇక్కడ శివాజీ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడంటే అంతకముందే శోభాతో గట్టి ఆర్గ్యూమెంట్ అయ్యింది.శివాజీ ఇలా ఉంటే కష్టం అమ్మా, భవిష్యత్ లో కూడా పనికొస్తుంది అని చెప్తుంటే.,

మా అమ్మానాన్న బాగానే పెంచారు సార్, మీరు చెప్తే నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనే సెన్స్ లో మాట్లాడింది శోభా. వీరిద్దరికీ పెద్ద గొడవే అయ్యింది. అరుచుకోకుండానే మాటలతో రెచ్చగొట్టుకున్నారు. నేను కూడా నీకంటే పెద్ద నటుడ్నే అన్నట్లుగా మాట్లాడాడు శివాజీ. దీని తర్వాత అమర్ దీప్ పల్లవి పై విరుచుకుని పడ్డాడు. మరి ఈ మూమెంట్ లో అమర్ దీప్ కి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదీ మేటర్.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus