ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఇప్పటివరకు అందుబాటు ధరలో ఉన్నది అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) మాత్రమే. మిగతా ఇంటర్నేషనల్ ఓటీటీ సంస్థలన్నీ ఏడాదికి ఇంచుమించుగా 7000/- రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నాయి. అందుకే వాటిని చాలా తక్కువమంది సబ్ స్క్రైబ్ చేసుకుంటూ వస్తున్నారు. అందుకే ఇండియాలో నెట్ ఫ్లిక్స్ కంటే అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్స్ ఎక్కువ. అందుకు కారణం అమెజాన్ ప్రైమ్ తొలుత ఏడాదికి 399/- రూపాయలు మాత్రమే చార్జ్ చేయగా, ఆ తర్వాత దాన్ని 699/-. 999/- ఇప్పుడు 1499/- చార్జ్ చేస్తున్నారు.
నిజానికి అమెజాన్ ప్రైమ్ సినిమాల మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ కి రిటర్న్స్ ఎలా అనేది చాలా మందికి అర్థం కాని బిజినెస్ మోడల్. అయితే.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ అసలు ఆట మొదలుపెట్టింది. ఆల్రెడీ 1499/- రూపాయలు చార్జ్ చేస్తున్న అమెజాన్ ప్రైమ్, ఇప్పుడు ఆ ప్యాకేజ్ లో లిమిటెడ్ యాడ్స్ పేరుతో యాడ్స్ ను ప్రవేశపెట్టనుంది.
ఒకవేళ జనాలు యాడ్స్ వద్దు అనుకుంటే.. మరో 699/- ఖర్చు చేసి ఒక యాడ్ ఆన్ ప్యాకేజ్ తీసుకోవాలి. అప్పుడే యాడ్స్ లేకుండా సినిమాలు చూడగలరు. ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) లో చాలా కొత్త సినిమాలు రెంట్ పద్ధతిలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆ విషయంలో యూజర్స్ చాలా చిరాకుపడతారు. అది సరిపోదన్నట్లు ఇప్పుడు ఈ లిమిటెడ్ యాడ్స్ అనేది కచ్చితంగా కొంచం ఎఫెక్ట్ చేస్తుంది.
బాగా అలవాటుపడిపోయిన జనాలు తప్పితే.. ఇప్పటికప్పుడు అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) యాడ్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ కోసం ఏడాదికి 2,200/- స్పెండ్ చేయడం అనేది కాస్త కష్టమే. మరి అమెజాన్ సంస్థ ఈ సమస్యను ఎలా అధిగమిస్తుందో చూడాలి. అయితే.. అమెజాన్ సంస్థ ఈ కొత్త గేమ్ ను రిస్క్ చేయడానికి కారణం వాళ్ల కంటెంట్ మీద ఉన్న నమ్మకమే. ఇకపై వాళ్లు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది.