రెండు భారీ చిత్రాలు షాకిచ్చిన వేళ సూర్య అయినా కాపాడతాడా?

అమెజాన్ ప్రైమ్ కి నాని, అనుష్క షాక్ ఇచ్చారు. ఫ్యాన్సీ ధర చెల్లించి దక్కించుకుంటే బ్యాడ్ టాక్ తెచ్చుకొని నిండా ముంచారు. నాని హీరోగా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన వి మూవీకి దాదాపు 38కోట్లు చెల్లించి ప్రైమ్ దక్కించుకుంది. ప్రేక్షకులలో ఉన్న పాజిటివ్ బజ్, ట్రైలర్స్, టీజర్స్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ చూసి ఏముంది భారీ హిట్ ఖాయం అనుకున్నారు అందరు. ఐతే అంచనాలకు భిన్నంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను థ్రిల్ చేయలేకపోయింది.

దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి ఓ సాదా సీదా మూవీ చేశారని అర్థం అయ్యింది. తాజాగా ఆరు నెలలలుగా విడుదల కోసం ఎదురు చూస్తున్న నిశబ్దం మూవీని ప్రైమ్ దక్కించుకుంది. ఈ చిత్రం కొరకు కూడా ప్రైమ్ బాగానే ధర చెల్లించిందట. దాని తోడు మల్టీ లాంగ్వేజ్ లలో విడుదల అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అవుతుంది అనుకున్నారు. వి మూవీకి మించిన బ్యాడ్ టాక్ నిశ్శబ్దం మూవీ తెచ్చుకుంది. అనుష్క నటన మినహా సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదంటున్నారు ప్రేక్షకులు.

రెండు బడా చిత్రాలు కొని దెబ్బ తిన్న ప్రైమ్ సూర్య నటించిన బైలింగ్వల్ మూవీ సురారై పోట్రు ని కూడా దక్కించుకుంది. ఈ మూవీ అక్టోబర్ 30న విడుదల కానుంది. ఆ రెండు చిత్రాలకు మించి ధరను ఈ మూవీకి ప్రైమ్ చెల్లించింది. హీరో సూర్య కావడంతో పాటు దర్శకు రాలు సుధా కొంగర కావడం ఈ మూవీ ఖచ్చితంగా ప్రేక్షకుల మనసులను గెలుస్తుందని నమ్మకం పెట్టుకున్నారు. మరి సూర్య అయినా ప్రైమ్ ని కాపాడతాడో లేదో చూడాలి.

Most Recommended Video

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus