దేవర (Devara) సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 23వ తేదీన మొదలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో దేవర అదరగొడుతోంది. యు/ఎ సర్టిఫికెట్ వచ్చిన సినిమా కావడంతో ఎలాంటి ఆంక్షలు లేకుండానే థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. మొదట దేవర మూవీ నిడివి తగ్గిస్తున్నారని ప్రచారం జరిగినా 2 గంటల 58 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. ఏఎంబీ సినిమాస్ లో దేవర సినిమాకు సంబంధించి 29 షోలు ప్రదర్శితమవుతుండగా అన్ని షోలు హౌస్ ఫుల్ కావడం గమనార్హం.
బుకింగ్స్ మొదలైన కొన్ని గంటల్లోనే ఏఎంబీ సినిమాస్ లో దేవరకు ఈ ఘనత సొంతమైంది. శుక్రవారం రోజున ఆఫీస్ ఉన్నవాళ్లు సైతం తెల్లవారుజామున థియేటర్లలో దేవర సినిమాను చూడటానికి తెగ ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. కర్నూలు జిల్లాలోని వీ మెగా ఆనంద్ సినీ కాంప్లెక్స్ లో మొత్తం ఆరు స్క్రీన్లు ఉండగా ఏకంగా దేవర సినిమాకు సంబంధించి 36 షోలు ప్రదర్శితమవుతున్నాయి. ఒక విధంగా ఇది రికార్డ్ అనే చెప్పాలి.
దేవర సినిమా బెనిఫిట్ షోలకు సంబంధించి కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది. 1000 రూపాయల చొప్పున దేవర మూవీ బెనిఫిట్ షోల టికెట్లు అమ్ముడవుతున్నాయని సమాచారం అందుతోంది. ఏపీలో ఈ పరిస్థితి ఉండగా తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. దేవర సినిమాలో క్లైమాక్స్ మాత్రం అభిమానుల అంచనాలకు మించి మెప్పించే ఛాన్స్ ఉంది.
దేవర1 బడ్జెట్ 300 కోట్ల రూపాయలు కాగా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం పక్కా అని చెప్పవచ్చు. దేవర సినిమా యాక్షన్ ప్రియులకు ఫుల్ మీల్స్ లా ఉంటుందని చెప్పవచ్చు. కొరటాల శివ (Koratala Siva) మాత్రం దేవరతో కచ్చితంగా హిట్ సాధిస్తాననే నమ్మకంతో ఉన్నారు.