ఏషియన్ సినిమాస్ తో కలిసి మహేష్ బాబు ఇటీవల “ఎ.ఎం.బి సినిమాస్” అనే మల్టీప్లెక్స్ ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఆ మల్టీప్లెక్స్ తమదే అని ఫిక్స్ అయిపోయి ఇప్పటికే నాలుగైదు షోలు వేసేశారు. అంతా బాగానే ఉంది కానీ.. మల్టీప్లెక్స్ రేట్స్ మాత్రం సామాన్యులకు అందుబాటులో లేదని చర్చలు జరుగుతున్నాయి. టికెట్ ప్రైస్ మరీ 200 ఉండడం, అందులోనూ M లాంజ్ అని స్పెషల్ చార్జ్ చేస్తుండడంతో డబ్బున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ లేదా సంపన్నులు మినహా రెగ్యులర్ సినిమా ఫ్యాన్స్ థియేటర్ కి వెళ్ళే సూచనలు కనిపించడం లేదు.
పి.వి.ఆర్ వంటి సంస్థలు కూడా కొత్తగా థియేటర్ పెట్టినప్పుడు జనాల్ని థియేటర్ కి అలవాటు చేయడం కోసం తొలుత సగం రేటుకే టికెట్ అమ్ముతుంటారు. దాంతో జనాలు ముందు ఆ ప్లేస్ కి అలవాటుపడి.. అనంతరం సాధారణ ధరకి వచ్చేసిన తర్వాత కూడా అదే థియేటర్ కి ఫిక్స్ అవ్వడమో లేక ఆప్షన్స్ లో ఆ థియేటర్ ను పెట్టుకోవడమో చేస్తారు. కానీ.. ఎ.ఎం.బి సినిమాస్ మాత్రం అందుకు భిన్నంగా పోరారంభమే ఈ భారీ రేట్ తో చేసేసరికి ఈ సూపర్ ప్లెక్స్ ఎందరికీ చేరువవుతుందా అని ఆలోచనలోపడ్డారు. చూడాలి మరి ఏమవుతుందో.