Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్ హీరోయిన్ కౌంటర్
- September 7, 2026 / 01:19 PM ISTByFilmy Focus Desk
సినిమా – క్రికెట్.. ఈ రెండింటి మధ్య సంబంధం చాలా పెద్దది. ఎన్నో ఏళ్లుగా ఈ స్టైల్ చూస్తూనే ఉన్నాం. క్రికెటర్లు – హీరోయిన్ల మధ్య ఎన్నో ఏళ్లుగా ప్రేమకథలు, పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. అందుకే సినిమా తారలు, క్రికెటర్ల బయట ఎక్కడైనా కనిపిస్తే.. వెంటనే ఓ కథ అల్లేస్తున్నారు. వయసు, పరిస్థితులు లాంటివి ఏవీ పట్టించుకోకుండా లింక్‌లు పెట్టేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సీనియర్ కథానాయిక అమీషా పటేల్.. (Ameesha Patel) స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మధ్య ఏదో నడుస్తోందనే చర్చ మొదలైంది.
Ameesha Patel
దీనంతటికి కారణం.. ముంబయిలో ఇటీవల జరిగిన ఓ వేడుకలో హార్దిక్ పాండ్య భుజంపై అమీషా చేయి వేసి పలకరించడమే. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, వారిద్దరి మధ్య రిలేషన్ ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ వచ్చింది. ఈ విషయం మాట్లాడుకునేటప్పుడు హార్దిక్ పాండ్యకు ఇప్పటికే ఓ గర్ల్ ఫ్రెండ్ ఉందని.. ఆమె పేరు మహీకా శర్మ అని ఆ నెటిజన్‌కి గుర్తు రాలేదు అనిపిస్తోంది.

ఇక ఆ రూమర్‌కి అమీషా పటేల్ (Ameesha Patel) ఇచ్చిన ఆన్సర్ కూడా చూస్తే.. భలే రిప్లై ఇచ్చింది కదా అనిపిస్తుంది. “నీకు గర్ల్‌ఫ్రెండ్ లేదని నీ కామెంట్ చూస్తే అర్థమవుతోంది. ఒక అమ్మాయి సాధారణంగా పలకరించినా అందులో తప్పు వెతుకుతున్నావు. ఓ వ్యక్తి మీద ఆప్యాయంగా చేయి వేస్తే దానిని కూడా లవ్, డేటింగ్ అని అనుకుంటున్నావు. ముందు నువ్వు ఒక గర్ల్‌ఫ్రెండ్‌ని వెతుక్కో, ఆ తర్వాత ఇలాంటి ఊహాగానాలు ప్రచారం చేయచ్చు” అని అమీషా తన రిప్లైలో రాసుకొచ్చింది.

తన స్నేహితులను హార్దిక్ పాండ్యకు పరిచయం చేయడానికి మాత్రమే తాను అక్కడికి వెళ్లానని అమీషా పటేల్ (Ameesha Patel) తన రిప్లైలో క్లారిటీ ఇచ్చింది. దీంతో ఇప్పటికైనా ఆ రూమర్లు ఆగుతాయేమో చూడాలి. ఇక మహీకా శర్మ సంగతి చూస్తే.. ఆమె ప్రముఖ మోడల్. గత కొన్నేళ్లుగా ఇద్దరూ రిలేషన్‌లో/ డేటింగ్‌లో ఉన్నారు. ఇటీవల వీరిద్దరూ ఓ ఖరీదైన కారులో ఔటింగ్‌కు వెళ్లిన వీడియోలు వైరల్ అయ్యాయి.
బాలీవుడ్ బజ్ కోసం ‘డ్రాగన్’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?
















