Raj Kundra: పోర్నోగ్రఫీ కేసులో నటికి షాక్!

  • July 27, 2021 / 11:39 AM IST

పోర్నోగ్రఫీ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అశ్లీల చిత్రాల తయారీ, పంపిణీకి సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పలు సాక్ష్యాలను సేకరించగా.. వియాన్ ఇండస్ట్రీలకు చెందిన నలుగురు ఉద్యోగులు కీలక సమాచారాన్ని పోలీసులు అందించారు. తాజాగా ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్ కుంద్రాకు పోర్న్ వీడియోల రాకెట్టుకు సంబంధించి మొదటి నుండి వార్తల్లో ఉన్న నటి,

మోడల్ షెర్లిన్ చోప్రాకు సమన్లు జారీ చేశారు అధికారులు. జూలై 27 ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్ నోటీసులిచ్చింది. ఈ కేసుకి సంబంధించి షెర్లిన్ చోప్రా స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు రాజ్‌కుంద్రాకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను ముంబయి పోలీసులు సీజ్‌ చేస్తున్నారు. కాన్పూర్‌లోని స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా శాఖలో రాజ్‌కుంద్రా,

శిల్పాశెట్టిలకు ఉన్న అకౌంట్ లను స్తంభింపచేయాలని ఎస్‌బీఐకి సూచించారు. తాము 20-25 నిమిషాల నిడివితో షార్ట్‌ ఫిల్మ్స్‌ చేసినట్లు ఈ కేసుతో సంబంధం ఉన్న దర్శకుడు తన్వీర్‌ హష్మి ఒప్పుకొన్నారు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus