సాధారణంగా 60 సంవత్సరాల వయస్సు దాటితే మనిషిలో కష్టపడే శక్తి, ఓపిక సైతం పోతాయనే సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సైతం 60 ఏళ్ళ తర్వాత సినిమాల సంఖ్యను తగ్గిస్తారు. అయితే హీరోలలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మాత్రం మిగతా హీరోలకు భిన్నమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కల్కి (Kalki 2898 AD) సినిమాలో అమితాబ్ చేసిన ఫైట్ సీన్లు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. అయితే కొంతమంది మాత్రం 81 సంవత్సరాల వయస్సులో అమితాబ్ బచ్చన్ రిస్కీ సన్నివేశాలలో నటించడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు.
అమితాబ్ మేలు కోరి కొందరు అభిమానులు ఈ తరహా కామెంట్లు చేయడం జరిగింది. అయితే ఈ కామెంట్లు తన దృష్టికి రావడంతో అమితాబ్ ఈ కామెంట్ల గురించి రియాక్ట్ అయ్యారు. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారు. నేను ఇంకా ఎందుకు పని చేస్తున్నానని సెట్ లో ఎవరో ఒకరు తరచూ అడుగుతూ ఉంటారని ఆయన తెలిపారు.
అయితే సెట్ లో వ్యక్తులు అడిగే ఈ ప్రశ్నకు నా దగ్గర సరైన జవాబు లేదని అమితాబ్ చెప్పుకొచ్చారు. సినిమా అనేది నాకొక ఉద్యోగం లాంటిదని నేను చేసుకుంటూ పోతున్నానని ఆయన పేర్కొన్నారు. మీరు ఏమనుకున్నా నా పని నేను చేసే స్వేచ్చ అయితే నాకు ఉందని అమితాబ్ తెలిపారు. నా కారణం నేను చెప్పానని మీరు ఏకీభవిస్తారో లేదో మీ ఇష్టమని ఆయన వెల్లడించారు.
ఇసుక కోటలను నిర్మించే సమయంలో అందరూ ఎంజాయ్ చేస్తారని అవి కూలిపోయినా మళ్లీ కట్టడానికి ప్రయత్నిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఈసారి ఆ కోటలు మరింత దృఢంగా ఉండాలని నేను ఫీలవుతానని ఆయన తెలిపారు. అమితాబ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.