బ్లాగ్‌ పోస్టుతో ఆందోళనలో బిగ్‌బీ అభిమానులు

అమితాబ్‌ బచ్చన్‌ తన మనసులోని భావాల్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉంటారు. బ్లాగ్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌… ఇలా అన్నింటా ఆయన ముచ్చట్లు కనిపిస్తూ ఉంటాయి. అలా శనివారం రాత్రి 10 తర్వాత ఆయన రాసిన ఓ బ్లాగ్‌ పోస్టు.. అభిమానుల్ని ఆందోళనకు గురి చేసింది. ‘medical condition .. surgery .. can’t write’ అంటూ ఓ చిన్న బ్లాగ్‌ పోస్టు రాసుకొచ్చారు బిగ్‌బీ. రాత్రి ఆ పోస్టును తక్కువ మందే చూసినా..

ఆదివారం ఉదయం నాటికి ఆ విషయం వైరల్‌ అయ్యింది. ఆ తర్వాత ఆ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్‌ లేదు. సర్జరీ నిమిత్తం ఆసుపత్రికి వెళుతున్నట్టు రాసుకొచ్చిన బిగ్‌బీ… ఆ సర్జరీ దేని కోసం, పూర్తైందా లేదా అనే అంశంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ విషయంలో ఆయన తనయుడు అభిషేక్‌ బచ్చన్‌ నుండి కూడా ఎలాంటి స్పందన లేదు. మరి సోమవారం నాటికైనా ఈ విషయంలో అప్‌డేట్‌ వస్తుందేమో చూడాలి.

గతంలో ‘కూలీ’ చిత్రీకరణ సమయంలో బిగ్‌బీకి ప్రమాదం జరిగింది. ప్రాణాపాయ స్థితి నుండి క్షేమంగా బయటపడ్డారు. మరిప్పుడు ఈ శస్త్రచికిత్స దేని కోసమో చూడాలి. అందరిలాగే మనం కూడా బిగ్‌బీ త్వరగా కోలుకోవాలని వేడుకుందాం. Get Well Soon Amitabh Ji.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus