Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » ఆత్మీయ అతిధుల మధ్య ఘనంగా ప్రారంభమైన “అమ్మా నాన్న మధ్యలో మధురవాణి”

ఆత్మీయ అతిధుల మధ్య ఘనంగా ప్రారంభమైన “అమ్మా నాన్న మధ్యలో మధురవాణి”

  • March 29, 2022 / 09:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆత్మీయ అతిధుల మధ్య ఘనంగా ప్రారంభమైన “అమ్మా నాన్న మధ్యలో మధురవాణి”

నూతన తారలు గౌతమ్ రాజ్ , సాయి విక్రాంత్ హీరోలుగా , మధుప్రియ, లావణ్య శర్మ, సిరి మరియు అంబిక హీరోయిన్స్ గా పానుగంటి మహంకాలమ్మ, యాదయ్య గౌడ్ సమర్పణలో మానస క్రియేషన్స్ పతాకంపై టి.డి.ప్రసాద్ వర్మ దర్శకత్వంలో బృందాకర్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం “అమ్మ నాన్న మధ్యలో మధురవాణి”. ఈ చిత్రం మార్చి 28న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిథుల మధ్య ఘనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం హీరో, హీరోయిన్స్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి బెక్కం వేణుగోపాల్ క్లాప్ నివ్వగా ఫణి కుమార్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.. గౌరవ దర్శకత్వం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు గారు చేశారు..

Click Here To Watch NOW

ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో గౌతం రాజ్ ,మధుప్రియ ,సాయి విక్రాంత్ ,సిరివెన్నెల మెయిన్ లీడ్ పాత్రల్లో నటిస్తుండగా.. నరేష్ వీకే, పవిత్ర లోకేష్, నందమూరి తారకరత్న, కెప్టెన్ చౌదరి, బేబీ శరణ్య, మాస్టర్ రాకేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ మొదటివారం నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.. అనంతరం ఏర్పాటైన సమావేశంలో నరేష్ వీకే, నటి పవిత్ర లోకేష్, హీరోలు గౌతమ్ రాజ్, సాయి విక్రాంత్, హీరోయిన్స్ అంబిక, మధుప్రియ, లావణ్య శర్మ, దర్శకుడు టిడి ప్రసాద్ వర్మ, సినిమాటోగ్రాఫర్ వాసు, సంగీత దర్శకుడు కార్తీక్ బి. కడకండ్ల, గేయ రచయిత మిట్ట పల్లి సురేందర్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, చిత్ర నిర్మాత బృందాకర్ గౌడ్ పాల్గొన్నారు…

నటుడు నరేష్ వీకే మాట్లాడుతూ.. దర్శకుడు ప్రసాద్ వర్మ నాకు బాగా కావాల్సిన వ్యక్తి.. మా కుటుంబ సభ్యుడు.. అతను ఫస్ట్ రాధ కృష్ణ మూవీ చేసాడు అది గత సంవత్సరం రిలీజ్ అయి మంచి హిట్ అయింది.. “అమ్మా నాన్న మధ్యలో మధుర వాణి” టైటిల్ తో నాకు కథ చెప్పాడు ప్రసాద్ వర్మ గారు. చాలా అద్భుతంగా ఉంది. ముందు నాకు టైటిల్ చాలా బాగా నచ్చింది.. దానికి ఎట్రాక్ట్ అయ్యాను.. అందరికి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది.. ఇందులో నేను, పవిత్ర లోకేష్,తారక రత్న ముఖ్య పాత్రల్లో లో నటిస్తున్నాం.

మంచి స్టార్ కాస్ట్ అంతా యాక్ట్ చేస్తున్నారు. డిఫరెంట్ న్యూ జోనర్ లో వస్తున్న గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ప్రస్తుతం కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ బాగా హిట్ అవుతున్నాయి. ఈ చిత్రం కూడా తప్పకుండా అందరికీ నచ్చుతుంది.. బృందాకర్ గౌడ్ ప్రసాద్ వర్మను నమ్మి ఈ చిత్రం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సినిమాతో ఆయన మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

చిత్ర దర్శకుడు టిడి ప్రసాద్ వర్మ మాట్లాడుతూ.. ఫస్ట్ నేను రాధాకృష్ణ అనే మూవీ చేశాను. ఇది నా సెకండ్ ఫిల్మ్. నరేష్ గారి ఫ్యామిలీతో ఆరేళ్ళు అనుబంధం ఉంది. ఆ పరిచయంతో ఆయనకి ఈ కథ చెప్పాను. నరేష్ గారు చాలా బాగుంది నేను చేస్తాను అని నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ఇదొక ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. టు జెనరేషన్స్ కి కనెక్ట్ అయ్యే కథ ఇది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి రెండు షెడ్యూల్స్ లో ఫినిష్ చేస్తాం. నిర్మాత బృందాకర్ గౌడ్ గారు కథ నచ్చి ఎంతో ఇన్స్పైర్ అయి ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్ అన్నారు.

పుట్ట మధు మాట్లాడుతూ.. మా పెద్దపల్లి వాసి ప్రసాద్ వర్మ మంథని మట్టి గడ్డ తెలంగాణ ముద్దుబిడ్డ. అతను చేస్తున్న ఈ చిత్రం చాలా గొప్ప హిట్ అయి యూనిట్ అందరికీ మంచి పేరు రావాలి అన్నారు.

నటి పవిత్ర లోకేష్ మాట్లాడుతూ.. క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ సినిమా చేస్తున్నారు ప్రసాద్ వర్మ. సిచువేషన్స్ కి తగ్గట్లుగా కంటెంట్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ వస్తున్న ఈ తరుణంలో అమ్మా నాన్న మధ్యలో మధురవాణి చిత్రం కూడా అందరికీ నచ్చేలా ఉంటుంది. మంచి కథతో ఈ సినిమాని తీస్తున్నారు.. డెఫినెట్ గా ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుంది.. అన్నారు.

చిత్ర నిర్మాత బృందాకర్ గౌడ్ మాట్లాడుతూ.. బేసిక్ గా మాది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ప్రసాద్ వర్మ చెప్పిన స్టోరీ నచ్చి ఈ సినిమా చేస్తున్నాను. మా అబ్బాయి గౌతమ్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. నరేష్ గారు, పవిత్ర లోకేష్ గారు అందరూ ఎంతో ఎంకరేజ్ చేస్తూ.. సపోర్ట్ చేస్తున్నారు. కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూసే చిత్రం ఇది.. అన్నారు.

హీరో గౌతమ్ రాజ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో హీరోగా నటించే ఛాన్స్ ఇచ్చిన మా దర్శకుడు ప్రసాద్ వర్మ కి థాంక్స్. మా డాడీ బృందాకర్ గౌడ్ నిర్మాతగా చేస్తున్నారు.. మంచి కథతో అందరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుంది.. అన్నారు.

సంగీత దర్శకుడు కార్తీక్ బి. కొడకండ్ల మాట్లాడుతూ.. ఈ సినిమాలో మ్యూజిక్ కి ఎంతో స్కోప్ ఉంది.. నా వంతు మంచి పాటలు చేయడానికి కృషి చేస్తాను.. అన్నారు.

పాటల రచయిత మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే సినిమా పాటలు రాస్తున్నాను. ఈ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు నా థాంక్స్.. అన్నారు.

ఇక ఈ చిత్రంలో నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాం.. తప్పకుండా ఈ చిత్రం మాకు మంచి పేరు తెస్తుందని ఆశాభావంతో ఉన్నాం అని హీరోయిన్స్ అంబిక, మధు ప్రియ, లావణ్య శర్మ అన్నారు. ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు ఛాయాగ్రహణం: వాసు, ఎడిటింగ్: శివ శర్వాణి, మాటలు: కుమార్ మల్లారపు, ఉదయ్ శర్మ, నాగమణి రాజు, సాహిత్యం: మిట్టపల్లి సురేందర్, ఆర్ట్: మోహన్-నరేష్, పి.ఆర్.ఓ: సురేష్ కొండేటి. ప్రొడ్యూసర్:బృంధాకర్ గౌడ్, కథ.స్క్రీన్ ప్లే.దర్శకత్వం: టి.డి.ప్రసాద్ వర్మ.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amma nanna madhyalo madhuravani
  • #Gowtham Raj
  • #Lavnya Sharma
  • #Madhu priya
  • #Sai Vikranth

Also Read

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Robinhood: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Robinhood: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

related news

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Mohanlal: ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

Mohanlal: ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

Rukmini Vasanth: ఇంకా హిట్టు పడలేదు.. కానీ డిమాండ్ మామూలుగా లేదు..!

Rukmini Vasanth: ఇంకా హిట్టు పడలేదు.. కానీ డిమాండ్ మామూలుగా లేదు..!

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Robinhood: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Robinhood: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Bobby Deol: ‘హరిహర వీరమల్లు’ లో బాబీ డియోల్ రోల్ వెనుక ఇంత జరిగిందా?

Bobby Deol: ‘హరిహర వీరమల్లు’ లో బాబీ డియోల్ రోల్ వెనుక ఇంత జరిగిందా?

trending news

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

41 mins ago
Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

1 hour ago
Robinhood: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Robinhood: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

1 hour ago
Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

3 hours ago
Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

21 hours ago

latest news

Naga Chaitanya: అన్ని సినిమాలు ఎలా వదులుకున్నావ్‌ చైతు.. మరీ టూ మచ్ కదా?

Naga Chaitanya: అన్ని సినిమాలు ఎలా వదులుకున్నావ్‌ చైతు.. మరీ టూ మచ్ కదా?

3 hours ago
Ee Nagaraniki Emaindi: ‘ఈ నగరానికి ఏమైంది?’ సీక్వెల్ వెనుక ఇంత కథ నడిచిందా?

Ee Nagaraniki Emaindi: ‘ఈ నగరానికి ఏమైంది?’ సీక్వెల్ వెనుక ఇంత కథ నడిచిందా?

18 hours ago
Kingdom Movie: ‘కింగ్డమ్’ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!

Kingdom Movie: ‘కింగ్డమ్’ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!

18 hours ago
చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

22 hours ago
Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version