నేటి యువతకు చేతిలో ఇమిడిపోయే బెస్ట్ ఫ్రెండ్ స్మార్ట్ ఫోన్. ఈ తరం సలాం చేసే గాడ్జెట్ ఇది. దీని గొప్పదనం వెనుక తరాల వారికి చెప్పాలనే ఆశతో చిక్కుల్లో పడింది ఓ అమ్మాయి. గత వారం పార్లర్ల తీరు పై పంచ్ లు వేసి నవ్వులు పూయించిన “మహాతల్లి”… ఈసారి “అమ్మ నేను ఓ స్మార్ట్ ఫోన్ టాక్” అంటూ నవ్వించడానికి మనముందు కొచ్చింది.
ఈ టాక్ కి ముందు ఏమి జరిగిందంటే..
ఇంట్లో 24 గంటలూ స్మార్ట్ ఫోన్ తో గడుపుతుంటే తల్లిదండ్రులు.. అందులో ఏముందని విసుక్కుంటారు. ముఖ్యంగా అమ్మాయిలను వాళ్ల తల్లులు ప్రశ్నిస్తుంటారు. ఈ భాద నుంచి తప్పించుకోవాలని నేటి అమ్మాయి… తన తల్లికి స్మార్ట్ ఫోన్ ఉపయోగాలను వివరించింది. వాట్స్ అప్ వాడడం, ఫేస్ బుక్ పోస్ట్ ల గురించి నేర్పించింది. ఆన్ లైన్ షాపింగ్ ఎలా చేయాలో తెలిపింది. తను చేసిన పనికి తానే మెచ్చుకుంది. తరువాత చిక్కుల్లో పడింది.
అమ్మ పంపిన వాట్స్ అప్ మెసేజ్ కి రిప్లయ్ ఇవ్వకుండా .. అబద్ధం చెప్పి ఇరుక్కుంది. తనకు నచ్చని ఫోటోను పేస్ బుక్ లో అప్ లోడ్ చేసినా ఏమి చెయ్యలేక భాద పడింది. తను ఒకటి తలిస్తే అమ్మ మరొకటి తలిచిందని తల పట్టుకుంది. “అమ్మ నేను ఓ స్మార్ట్ ఫోన్ టాక్ “లోని ప్రతి సన్నివేశం నవ్వుని తెప్పిస్తుంది.
స్మార్ట్ అంశాలను లేటెస్ట్ గా నేర్చుకున్న తల్లిగా.. అమ్మకి అర్ధం అయ్యేలా చెప్పలేక ఇబ్బంది పడే కూతురిగా జాహ్నవి అనుభవం ఉన్న నటిగా నటించారు. ఈ షార్ట్ ఫిలిం నేటి అమ్మాయిలు చూసి కొన్ని సంగతులు తప్పకుండా నేర్చుకుంటారు.