మాస్టర్‌ సొంతంగా నిర్ణయం తీసుకోలేదా.. ఎవరో చెప్పారా?

ఎవరినైనా గుండు గీసుకోమంటే.. ఒక్క క్షణం ఆలోచించి ఓకే అని చెప్పేస్తారు. అదే అరగుండు చేసుకోమంటే చాలా సేపు ఆలోచిస్తారు. ఫైనల్‌గా నో అని చెబుతారు. అదే అరగుండుతోపాటు అర మీసం కూడా గీయించుకోమంటే… ఒక్క క్షణం కూడా ఆలోచించరు. కానీ బిగ్‌బాస్‌ ఇంట్లో ఓ వ్యక్తి ముందుకొచ్చాడు. నామినేషన్‌ నుంచి సేఫ్‌ చేస్తాం అని నాగార్జున చెప్పారనో, ఇంకెందుకో గానీ ఒప్పేసుకున్నాడు. గుండు గీయించేసుకున్నాడు. అతనే అమ్మ రాజశేఖర్‌. అవును మాస్టర్‌ ఈ రోజు రాత్రి గుండు గీయించుకున్నారు.

మొన్న జరిగిన అమీ తుమీ టాస్క్‌లోనే అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ అర గుండు గీయించుకోవడానికి ముందుకొచ్చారు. అయితే అంతకుముందు కాసేపు తటపటాయించాడు. ఇంట్లో వాళ్లు నచ్చజెప్పి చూశారు. ‘జుట్టు అంటే మీకు చాలా ఇష్టం. గీయించుకోవద్దు’ అన్నారు. అయినా మాస్టర్‌ సిద్ధపడ్డాడు. అయితే ఏమైందో కాసేపయ్యాక మళ్లీ కుదరదు అన్నాడు. దీంతో ఆ రోజు ఆ టాస్క్‌ ఆగిపోయింది. ఈ రోజు నాగ్‌ ఆ విషయాన్ని మరోసారి తెర మీదకు తెచ్చాడు. ఇప్పుడు అరగుండు గీయించుకుంటే కెప్టెన్సీ కంటెస్టెంట్‌ కాదు… వచ్చే వారం నామినేషన్‌ నుంచి సేఫ్‌ అని చెప్పాడు.

ఈసారి అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ పెద్దగా ఆలోచించలేదు. ఎవరు చేస్తారు అని నాగ్‌ మాట పూర్తి చేసిన వెంటనే ‘నేను రెడీ’ అని సిద్ధమయ్యాడు. నాగ్‌ మాట ప్రకారం నోయల్‌ ట్రిమ్మింగ్‌ చేయడానికి సిద్ధమయ్యాడు. ఇంటి సభ్యులు ఆసక్తిగా చూస్తున్న సమయంలో, నాగ్‌ మరోసారి మాస్టర్‌ను అడిగాడు. అప్పుడు కూడా మాస్టర్‌ ఓకే బాబు అనడంతో అర గుండు గీసేశారు. అంతా బాగానే ఉంది. ఆ రోజు గుండు గీసుకోవడానికి ఇష్టపడని మాస్టర్‌ ఈ రోజు ఎందుకు అంగీకరించినట్లు. ఏమో మరి. అయితే ఆఖరులో దివి వచ్చి… ‘మీ డెసిషన్‌ మీరు తీసుకోలేరా… నో అని చెప్పలేరా మీరు’ అనేసి వెళ్లిపోయింది. ఆ లెక్కన మాస్టర్‌ తీసుకున్న నిర్ణయం ఆయన సొంత నిర్ణయం కాదా… ఎవరో మాట విని చేశాడో. చూద్దాం ఈ రోజు ఎపిసోడ్‌లో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus