డాన్స్ మాస్టర్ గా అడుగుపెట్టి దర్శకులుగా మారి సినిమాలు చేసిన వాళ్ళు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ప్రభుదేవా, లారెన్స్ మాస్టర్ ఇద్దరూ డైరెక్టర్లుగా సక్సెస్ అయ్యారు. అటు డాన్స్ కోరియోగ్రాఫర్లుగా మంచి స్టేజి లో ఉంటూనే ఇటు దర్శకులుగా హిట్లు కొడుతున్నారు. వీరి లాగానే డాన్స్ మాస్టర్ నుండి దర్శకుడిగా మారిన మరో వ్యక్తి అమ్మ రాజశేఖర్. డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపు ఉన్న అమ్మ రాజశేఖర్ ఆ తరువాత దర్శకుడిగా మారాడు. తమిళ సినిమాలతో దర్శకుడిగా మారి సక్సెస్ అయ్యాడు అమ్మ రాజశేఖర్.
ఇటు తెలుగులో గోపీచంద్ హీరోగా రణం సినిమా తీసి హిట్ కొట్టాడు. ఇక ఆసినిమా హిట్ అవ్వడంతో ప్రభాస్ తో సినిమా చేయడానికి కథ సిద్ధం చేసుకున్నాడు. ప్రభాస్ నుండి పిలుపు రావడంతో కథ చెప్పడానికి వెళ్లాల్సి ఉండగా వేరే కారణాల వల్ల రెండు రోజులు లేట్ అయింది. ఇంక మళ్ళీ వెళితే ప్రభాస్ బిజీగా ఉన్నాడని కలవడం కుదరదని చెప్పడంతో నేను అక్కడే ఎదురుచూసి ఉండవచ్చు కానీ అదే సమయంలో నితిన్ ఫోన్ చేసి ఒక పాటకు డాన్స్ మాస్టర్ గా కావాలని అడిగాడు.
ఇక ప్రభాస్ బిజీగా ఉన్నానని చెప్పించడం వల్ల నేను నితిన్ తో సినిమా చేయాలని అనుకున్నాను. అంతా ఓకే అనుకున్నాక కథ తేడా అనిపించి మారుద్దామని అనుకున్న సమయంలో మచ్చా రవి నా దగ్గర స్క్రిప్ట్ కి పనిచేసే వాడు అతను కథ వినిపించి ప్రొడ్యూసర్స్ తో ఓకే చేయించుకోవడంతో నాకు ఇగో హర్ట్ అయింది. నితిన్ తో చేయాలని ఫిక్స్ అయి తమిళ డిజాస్టర్ మూవీని రీమేక్ చేయాల్సి వచ్చింది, అదే టక్కరి సినిమా. అది ఫ్లాప్ అవుతుందని ముందే తెలుసు. కానీ చేశా, దానివల్ల నా కెరీర్ నాశనం అయింది.
ప్రభాస్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేసుంటే నా కెరీర్ బాగుండేది నితిన్ లాంటి హీరోతో చేయడం వల్ల ఇక ఆ సినిమా ప్లాప్ అవ్వడం వల్ల నా కెరీర్ పోయింది. ఇక నితిన్ కి అది మంచి సినిమానే అయినా కానీ నన్ను గుర్తుపెట్టుకోలేదు. అప్పుడు నాతో చాలా క్లోజ్ గా ఉండేవాడు. ఇప్పుడు నా గురించి ఒక మాట కుడా మాట్లాడడు అంటూ కామెంట్స్ చేసారు. ఇక ఒకప్పుడు సినిమాల్లో డాన్స్ కంపోజ్ చేస్తే 5 లక్షలు తీసుకునే వారు కానీ నా కెరీర్ పీక్స్ లో నేను 8 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నాను. కానీ చెజేతులా నా కెరీర్ నేనే (Amma Rajasekhar) నాశనం చేసుకున్నాను అంటూ తెలిపారు.